Home జాతీయ వార్తలు ధర్నా విరమించిన కేజ్రీవాల్

ధర్నా విరమించిన కేజ్రీవాల్

kejri

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వంలో పని చేస్తున్న ఐఎఎస్ అధికారులు అనధికారిక సమ్మె చేస్తున్నారని ఆరోపిస్తూ గత తొమ్మిది రోజులుగా లెఫ్టెనెంట్ గవర్నర్  అనిల్ బైజల్ కార్యాలయంతో ధర్నా చేస్తున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం తన ధర్నాను విరమించుకొన్నా రు. ఐఎఎస్ అధికారులు  మంగళవారం జరిగిన రవా ణా, పర్యావరణ, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖల సమీ క్షా సమావేశాలకు హాజరయ్యారని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెప్త్తూ, మిగతా అధికారులు కూడా తమ విధులకు హాజరవుతారని భావిస్తున్నట్లు చెప్పారు. ఐఎఎస్ అధికారులు తమ సమ్మెను విరమించి, ఆప్ ప్రభుత్వానికి సహకరించేలా  చేసే వరకు లెఫ్టెనెంట్ గవర్నర్ కార్యాలయాన్ని వదిలిపెట్టేది లేదంటూకేజ్రీవాల్,  కేబినెట్‌లోని నలుగురు మంత్రులు ఈ నెల 11నుంచి ఆయన కార్యాలయంలోనూ బైఠాయించిన విషయం తెలిసిందే. అయితే ఆప్ మంత్రులు ఐఎఎస్ అధికారులతో భేటీ అయి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలంటూ లెఫ్టెనెంట్ గవర్నర్  ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు మంగళవారం లేఖ రాశారు.  అటు మంత్రులతో జరిగే సమావేశాలకు హాజరు కావలసిందిగా ఆ యన ఐఎఎస్ అధికారులను కూడా ఆదేశించినట్లు తెలుస్తోంది. ఐఎఎస్ అధికారుల భద్రతకు కేజ్రీవాల్ హామీ ఇచ్చినందున అధికారులకు, ఆప్ మంత్రులకు మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేపి సమస్యను పరిష్కరించడానికి చొరవ తీసుకోవాలని సిసోడియా లెఫ్టెనెంట్ గవర్నర్‌కు లేఖ రాశారు. ఈ లేఖపై త్వరగా స్పందించాలని  కేజ్రివాల్ ఆయననుకోరారు. దీనిపై మంగళవారం లెఫ్టెనెంట్ గవర్నర్ స్పందిస్తూ అధికారులతో సమావేశమై సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆప్‌ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. మరో వైపు ఐఎఎస్ అధికారులకు కూడా మంత్రులతో సమావేశాలకు హాజ రు కావాలని ఆదేశించడంతో సంక్షోభానికి తెరపడింది.