Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

జపాన్‌కు షాకిచ్చిన కెన్యా

kabaddiఅహ్మదాబాద్: ప్రపంచ కప్ కబడ్డీ పోటీల్లో జట్లన్నీ సెమీస్‌లోకి ప్రవేశించడానికి తెగ ప్రయత్నిస్తున్నాయి.ఆరు జట్లు తిరిగి ఫైనల్లోకి నాలుగు జట్లుగా పోటీపడతాయి. ఆదివారం తొలి కబడ్డీ మ్యాచ్‌లో అమెరికాపై తప్పక గెలవాల్సిన పరిస్థితి థాయ్‌లాండ్‌ది. ఇప్పటికే గ్రూపు-ఎలో ఇరాన్ అగ్రశ్రేణికి చేరుకుంది. ఇక రెండో స్థానం కోసం థాయ్‌లాండ్, జపాన్ పోటీపడుతున్నాయి. ఇప్పటికే రెండో స్థానం దక్కించుకుని సెమీస్‌కు అర్హత సాధించిన దక్షిణ కొరియా ఇంగ్లాండ్‌తో తలపడింది. జపాన్, కెన్యాల మధ్య ఇది చివరి మ్యాచ్, తమ ఆశలు దక్కాలంటే జపాన్ తప్పనిసరి గెలవాల్సిన పరిస్థితి. అయితే కెన్యా జపాన్ ఆశలకు గండికొడితే అప్పుడు అది థాయ్‌లాండ్‌కు సాయపడ్డటవుతుంది. కానీ అలానే జరిగిపోయింది. కెన్యా చేతిలో జపాన్ 48-27తో ఓడిపోయింది. దీంతో జపాన్ పోటీ నుంచి నిష్క్రమించి ఇంటిదారి పట్టింది. కాగా దక్షిణ కొరియా, ఇంగ్లాండ్‌ను 56-17తో ఓడించింది.
పూల్-బిలో థాయ్‌లాండ్, అమెరికాను 69-22 స్కోరుతో ఓడించింది. మొదటి అర్ధభాగం నుంచే ఆటలో ఆధిపత్యం చెలాయించిన థాయ్‌లాండ్, అమెరికా జట్టుపై సునాయాస విజయాన్ని సాధించింది. ఇప్పుడు థాయ్‌లాండ్ 15 పాయింట్లతో గ్రూప్-బిలో సెమిఫైనల్స్‌లోకి ప్రవేశించింది. నాలుగు గేమ్‌లు ఆడిన అమెరికా ఒక్క విజయం కూడా సాధించకుండా జాబితాలో అడుగున ఉంది.

Comments

comments