Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కెసిఆర్‌కు విజయన్ కృతజ్ఞతలు

Kerala CM thanks KCR for Rs 25 crore aid

ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పినరయి విజయన్ లేఖ

బియ్యం కావాలని కోరిన కేరళ అధికారులు
500 టన్నులు పంపాలని వెంటనే కెసిఆర్ ఆదేశం
100 టన్నుల దాణా, లక్ష 25వేల డోస్‌ల టీకా మందులు, వాహనాలకు జెండా ఊపిన తలసాని
మంత్రులు, ఐఎఎస్ అధికారుల విరాళాలు
రూ.10కోట్ల చెక్కును సిఎస్‌కు అందజేసిన టిఎన్‌జిఓ సంఘం 

మన తెలంగాణ/హైదరాబాద్ : కేరళ రాష్ట్రానికి వెంటనే 500 టన్నుల బియ్యం పంపాల్సిందిగా సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. వరదల్లో చిక్కుకున్న కేరళ ప్రజల అవసరాల నిమి త్తం బియ్యాన్ని పంపాలంటూ ఆ రాష్ట్రం నుంచి వచ్చిన విజ్ఞప్తికి స్పందించిన సిఎం కెసిఆర్ వెం టనే ఆ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వరదలతో ఇబ్బంది పడుతున్న కేరళ రాష్ట్రానికి రూ. 25 కోట్ల నగదుతో పాటు స్వచ్ఛ త్రాగునీటి కోసం ఆర్.ఓ. (రివర్స్ ఆస్మోసిస్) మిషన్లను, ‘బాలామృతం’ పౌష్టికాహారాన్ని పంపినందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ సిఎంకు సోమవారం లేఖ రాశారు. కేరళ అధికారులు కూడా తెలంగాణ అధికారులతో మాట్లాడి సాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

కేరళకు ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని కెసిఆర్ తమను ఆదేశించారని తెలంగాణ అధికారులు తెలిపారు. బియ్యం అవసరమవుతాయని కేరళ అధికారులు కోరారని, సిఎం కెసిఆర్ వెంటనే స్పందించారని, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, పౌర సరఫరాల కార్పొరేషన్ కమీషనర్ అకున్ సభర్వాల్‌తో మాట్లాడి వెంటనే కేరళకు 500 టన్నుల బియ్యం పంపాల్సిందిగా ఆదేశించారని ప్రభుత్వంవిడుదల చేసిన ప్రకటనలో పేర్కొనింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు కేరళ రాష్ట్రానికి కోటి రూపాయల విలువైన 500 టన్నుల బియ్యాన్ని పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

మంత్రులు, ఐఎఎస్ అధికార్ల విరాళాలు
కేరళ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం పక్షాన వరద సాయం రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్ అధికారుల సంఘం, రాష్ట్ర గెజిటెడ్ ఉద్యోగుల సంఘంతో పాటు పలు సంఘాలు, అసోసియేషన్లు స్వచ్చంధంగా ముందుకు వచ్చి విరాళాలను ప్రకటిస్తున్నాయి. తాజాగా సోమవారం రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తన నెల రోజుల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎంఎల్‌సి శంభీపూర్ రాజు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ మేముల ప్రశాంత్‌రెడ్డి, మునుగోడు ఎంఎల్‌ఏ కాసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తదితరులు తమ నెల రోజుల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం కూడా ఒక రోజు వేతానాన్ని కేరళ రాష్ట్రానికి విరాళంగా అందచేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర గెజిటెడ్ ఉద్యోగులు ఒక్క రోజు జీతాన్ని విరాళంగా ప్రకటించి రూ. 10 కోట్ల రూపాయల చెక్‌ను సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషికి అందజేశారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు కూడా ఒక రోజు వేతనాన్ని కేరళ వరద బాధితులకు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు.

చేయూతపై శాసనమండలి సభ్యుల
కేరళలో సహాయక చర్యల్లో తమ వంతు చేయూతను అందించేందుకు తెలంగాణ శాసనమండలి సభ్యులు కూడా సిద్దమవుతున్నారు. ఏ రకంగా సహాయక చర్యల్లో పాల్గొనాలనే అంశంపై బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఛాంబర్‌లో ఎంఎల్‌సిల సమావేశం జరుగుతుందని మండలి చీఫ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ భేటీకి టిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలంతా విధిగా హజరు కావాలని ఆయన కోరారు.

ఐపిఎస్ అధికారుల విరాళం
కెరళ వర బాధితుల సహాయ నిధికి తెలంగాణ ఐపిఎస్ అధికారులు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఐపిఎస్ అధికారుల సంఘం తరపున ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర డిజిపి ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

Comments

comments