Search
Sunday 18 November 2018
  • :
  • :

కేరళకు రూ.500 కోట్లు: మోడీ

Modi2

తిరువనంతపురం: కేరళ వరద ప్రభావిత ప్రాంతాల్లో శనివారం ప్రధాని నరేంద్ర మోడీ ఏరియల్ సర్వే చేపట్టారు. అంతకుముందు సిఎం పినరయి విజయన్‌తో ప్రధాని సమీక్షలు జరిపారు. కేరళకు రూ.500 కోట్లు తక్షణ సహాయ నిధి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు పరిహారం, తీవ్రంగా గాయపడినవారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కేంద్రం ఇంతకు ముందే కేరళకు రూ.100 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళ వరద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం మరో చేయూతనిచ్చింది. సిఎ కెసిఆర్ ఆదేశాల మేరకు విజయ డైరీ నుంచి రూ.40 లక్షలు విలువ చేసే 20 టన్నుల పాలపొడిని కేరళకు పంపిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

Comments

comments