Home తాజా వార్తలు అల్లుఅర్జున్‌కు కేరళ ప్రభుత్వం ఆహ్వానం

అల్లుఅర్జున్‌కు కేరళ ప్రభుత్వం ఆహ్వానం

 bunny
 స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి తెలుగులోనే కాదు మ‌ల‌యాళంలోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నసంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల కేర‌ళ‌లో వ‌చ్చిన వ‌ర‌ద బీభ‌త్సానికి త‌న వంతు సాయంగా రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించి గొప్ప మ‌న‌సు చాటుకున్నా మడు. కాగా, ఏటా కేరళలోని అలప్పుజలోని పున్నందా సరస్సులో పడవ పోటీలు నిర్వహిస్తారు. ఈ సారి నవంబరు 10న ఈ పోటీలు జరుగనున్నాయి.
ఈ పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గోవాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను ఆహ్వానిం చారు.సుమారు 65 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పోటీలను ‘నెహ్రూ ట్రోపీ బోట్ రేస్’ పేరిట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. దీంతో బన్నీ అభిమానుల్లో ఆనందానికి అవధుల్లేవు. తమ అభిమాన హీరోకు కేరళలోనూ మంచి క్రేజ్ ఉండటం, అక్కడి ప్రతిష్టాత్మక పోటీలకు ఆయన్ను అతిథిగా ఆహ్వానించడాన్ని గొప్పగా భావిస్తున్నారు. చివ‌రిగా నా పేరు సూర్య‌.. నా ఇల్లు ఇండియా అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బ‌న్నీ వ‌చ్చే నెల‌లో త్రివిక్ర‌మ్‌తో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడ‌ట‌. ఈ ప్రాజెక్టు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
stylish star Allu Arjun
  Kerala Government invited to stylish star Allu Arjun