Home తాజా వార్తలు అమలాపాల్‌కు బెయిల్

అమలాపాల్‌కు బెయిల్

Actress-Amala-Paul

చెన్నై: ప్రముఖ నటి అమలాపాల్ పన్ను ఎగవేత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 2017లో అమలాపాల్ రూ. కోటి విలువజేసే లగ్జరీ కారును కొనుగోలు చేయగా, తప్పుడు ధృవపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించి రూ.20 లక్షల పన్నును ఆమె ఎగవేశారనేది ఆరోపణ. ఈ నేపథ్యంలో పోలీసులు అమలపై కేసు నమోదు చేశారు. దీంతో ఆమె కేరళ హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దాంతో కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అమల పిటిషన్‌పై స్పందించిన కోర్టు పోలీసులకు లొంగిపోవాలని పేర్కొంది. మంగళవారం తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అమల లొంగిపోయిన సంగతి తెలిసిందే. కాగా, బుధవారం రూ. లక్ష పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది న్యాయస్థానం. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఇక అమలా తెలుగులో ఇద్దరమ్మాయిలతో, నాయక్, లవ్ ఫెల్యూర్, రఘువరన్ బి.టెక్ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Kerala High Court grants anticipatory bail to actor Amala Paul.