Home సినిమా ఘన విజయం దిశగా ‘కేశవ’

ఘన విజయం దిశగా ‘కేశవ’

keshavaవరుస హిట్లతో దూసుకుపోతున్న నిఖిల్ హీరోగా దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కేశవ’. ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి సక్సెస్‌ను సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన థాంక్స్‌మీట్‌లో సుకుమార్ మాట్లాడుతూ “సినిమా సక్సెస్ అయ్యిందా లేదా అని నిర్మాతను చూస్తే తెలుస్తుంది. నిర్మాత అభిషేక్ నామా ఎంతో సంతోషంగా ఉన్నారు. సుధీర్‌వర్మ ముందుగా ఈ కథను నాకే చెప్పారు. డిఫరెంట్‌గా ఉందని నేను చెప్పాను. నిఖిల్ ఏ కథలోనైనా చక్కగా ఒదిగిపోతున్నాడు. సింగిల్ ఎమోషన్‌ను చక్కగా పలికించాడు. సుధీర్‌వర్మ ఈ సినిమాను బాగా తెరకెక్కించాడు”అని అన్నారు. నిఖిల్ మాట్లాడుతూ “నేను ఊహించిన దానికంటే ప్రేక్షకులు సినిమాను పెద్ద హిట్ చేశారు. మూడు రోజుల్లో 11.4 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. నా సినిమాల్లో ఎక్కువ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ‘కేశవ’ నిలిచింది. నేను వైవిధ్యమైన కథలతో చేస్తున్న సినిమాలను ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్‌”అని చెప్పారు. సుధీర్‌వర్మ మాట్లాడుతూ “నేను అనుకున్నది అనుకున్నట్లుగానే సినిమా చేశాను. నిఖిల్ కథ చెప్పగానే ఒప్పుకున్నాడు. కథ మామూలగానే ఉన్నా ట్రీట్‌మెంట్ కొత్తగా ఉందని అభిషేక్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు”అని తెలిపారు. రీతూవర్మ మాట్లాడుతూ “సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు”అని అన్నారు.