Home తాజా వార్తలు కేశవరావ్ జాదవ్ కన్నుమూత

కేశవరావ్ జాదవ్ కన్నుమూత

Keshava Rao Jadhav Passed Away

హైదరాబాద్ : తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, పౌరహక్కుల సంఘం నేత కేశవరావు జాదవ్ (85) అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని హుస్సేని ఆలంలో 1933లో జాదవ్ జన్మించారు. తెలంగాణ సాయుధ పోరాటం, నాన్‌ముల్కీ గో బ్యాక్ ఉద్యమం, జై తెలంగాణ పోరాటం, తెలంగాణ ఉద్యమ మలి దశ పోరాటాల్లో ఆయన కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తెలంగాణ జన పరిషత్‌కు ఆయన కన్వీనర్‌గా కూడా పని చేశారు. ప్రజలకు సంబంధించి ఆయన అన్ని రకాల ఉద్యమాల్లో పాల్గొన్నారు. అన్నిరకాల ప్రజా ఉద్యమాల్లో ఆయన గొంతుక వినపడేది. 1997, సెప్టెంబర్ 28న ప్రొఫెసర్లు జయశంకర్ , కేశవరావ్ జాదవ్‌లు వేర్వేరుగా పని చేస్తున్న 28 ప్రజా సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ ఐక్యవేదికను ఏర్పాటు చేశారు. తొలి తెలంగాణ ఉద్యమంలో జాదవ్ పాల్గొని 17సార్లు అరెస్టు అయ్యారు. ఈ క్రమంలో ఆయన రెండేళ్ల జైలు జీవితం కూడా అనుభవించారు. జాదవ్ మృతిపై తెలంగాణ సిఎం కెసిఆర్, తెలంగాణ రాజకీయ నేతలు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Keshava Rao Jadhav Passed Away