Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

కేశినేని నాని మరో విజయ్ మాల్యా!

CH-Reddy-Bhaskar-Reddy

తిరుపతి : బ్యాంకుల నుంచి తీసుకున్న వందల కోట్ల అప్పులు చెల్లించకుండా ఎగనామం పెట్టి.. టిడిపి ఎంపి కేశినేని నాని మరో విజయ్ మాల్యా అవతారం ఎత్తారని వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శించారు. కేశినేని ట్రావెల్స్ మూసివేత వెనుక పెద్ద మతలబే జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పును నాని ఇతర అవసరాలకు మళ్లించారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఆయన ట్రావెల్స్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బులతో విజయవాడలో స్టార్ హోటల్ కడుతున్నారని, కేశినేని బస్సులను ఆర్‌టిసి స్వాధీనం చేసుకోవాలని భాస్కర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాగా శుక్రవారం అర్థరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా కేశినేని ట్రావెల్స్ బస్ సర్వీస్‌లను మూసి వేసిన విషయం తెలిసిందే.

Comments

comments