Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

పవన్ 4 రోజులు తిరిగితే.. 40 రోజులు ఇంట్లోనే….

Kesineni-Nani

అమరావతి: 2019 ఎన్నికల్లో బిజెపికి తెలుగు ప్రజలే బుద్ధి చెబుతారని ఎంపి కేశినేని నాని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీరియస్ పోలిటీషన్ కాదని, పవన్ నాలుగు రోజులు తిరిగితే.. నలబై రోజులు ఇంట్లో ఉంటారని ఎద్దేవా చేశారు. ఎపి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటే తెలుగు ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. ఎపిలో వైసిపి అధినేత జగన్, పవన్‌ను, తెలంగాణలో కెసిఆర్, గవర్నర్ నరిసింహన్‌ను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం నుంచి లోక్‌సభలో ప్రత్యేక హోదా కోసం తమ పోరాటం ఉధృతం చేస్తామని, విభజన హామీల అమలు కోసం కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. దేశంలో 16 రైల్వే జోన్లు ఇచ్చి… 17వ జోన్‌ను ఎందుకు నిరాకరిస్తున్నారని దుయ్యబట్టారు. విజయవాడ, విశాఖపట్నంకు మెట్రోలు ఎందుకు సాధ్యం కాదని, తక్కువ జనాభా కలిగిన నాగపూర్ మెట్రో ఎలా సాధ్యమైందని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుల్లెట్ ట్రైన్ లక్ష కోట్లు పెట్టుబడులు ఎలా పెడుతున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు.

Comments

comments