Home తాజా వార్తలు కీలక సన్నివేశాల చిత్రీకరణలో…

కీలక సన్నివేశాల చిత్రీకరణలో…

RRRరామ్‌చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఇప్పటికే ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం రెండవ షెడ్యూల్ సోమవారం ప్రారంభమైంది. రామ్‌చరణ్, ఎన్టీఆర్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో షూట్ చేయనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ వేశారు. ఈ సన్నివేశాల్లో తారక్ రఫ్ లుక్‌లో కనిపిస్తారట. ఇక అక్టోబర్ కల్లా షూటింగ్ పూర్తిచేసి వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెడతారని సమాచారం. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్టుకు కథ అందిస్తున్నారు. ఈ సినిమాలో అదితిరావు హైదరీని ఒక హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలిసింది.

Key Scenes in Rajamouli RRR Filming