Home తాజా వార్తలు కెజిఎఫ్2 ప్రారంభం

కెజిఎఫ్2 ప్రారంభం

KGF2బెంగళూరు : క‌న్న‌డ సినీ  పరిశ్రమలో  పీరియడ్ గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కెజిఎఫ్‌. ఈ సినిమాను తెలుగు, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల‌లో విడుద‌ల చేశారు. అన్ని భాషల్లోనూ ఈ సినిమా సూపర్ హిట్ అయింది.  శాండ‌ల‌్ వుడ్ చ‌రిత్రలో సరికొత్త రికార్డు నెల‌కొల్పిన ఈ సినిమాకు సీక్వెల్ ప్రారంభ‌మైంది. బెంగ‌ళూర్ లోని విజ‌య‌న‌గ‌ర్ ప్రాంతంలో ఉన్న‌ కొండండ్రం గుడిలో సీక్వెల్ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి హీరో యశ్ తో పాటు శ్రీనిధి శెట్టి, దర్శకుడు ప్రశాంత్ నీల్ తదితరులు హాజరయ్యారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు నిర్మాతలు తెలిపారు. కర్నాటకలో జరిగిన అక్రమ మైనింగ్ నేపథ్యంలో కెజిఎఫ్ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.యవనటుడు యశ్ ఈ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా స్వీకెల్ లోనూ యశ్ హీరోగా నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో రమ్యకృష్ణ, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తదితరులను తీసుకునేందుకు సినిమా యూనిట్ ప్రయత్నిస్తోందని సమాచారం. మొదటి భాగంలో నటించిన రవిశంకర్ , స్వీకెల్ లోనూ నటించనున్నారు. అదే పాత్రలో నటించే రవిశంకర్ పాత్ర రెండో భాగంలో మరింత పవర్ ఫుల్ గా ఉండనుందట. బాలీవుడ్ నటి రవీనా టాండన్, కన్నడ హీరో ఉపేంద్ర తదితరులు కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.

KGF 2 Movie Start