Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

‘కేజీఎఫ్’ ప్రేక్షకులకు పెద్ద ట్రీట్

KGFకైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్ పతాకంపై యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కీరగందూర్ నిర్మాతగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కేజీఎఫ్’ (కోలార్ గోల్డ్ ఫీల్డ్). ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చలన చిత్ర బ్యానర్‌పై నిర్మాత సాయి కొర్రపాటి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం బెంగుళూర్‌లో ఘనంగా జరిగింది. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఏక కాలంలో ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. డిసెంబర్ 21న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ నటుడు అంబరీష్ విచ్చేశారు. కన్నడ ట్రైలర్‌ను విడుదల చేసిన అంబరీష్ మాట్లాడుతూ “ఈ చిత్రం ట్రైలర్ చాలా గ్రాండ్‌గా ఉంది. కన్నడ సినిమా స్థాయిని ఇండియన్ సినిమా స్థాయికి పెంచేలా ఉంది”అని అన్నారు. తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసిన నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ “నేను బళ్లారి నుంచి హైదరాబాద్‌కు వెళ్లి నిర్మాతగా మారాను. నేను ఎప్పటి నుంచో ఒక కన్నడ సినిమా చేయాలనుకుంటున్నాను. ఈ సినిమాతో కన్నడ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాను”అని తెలిపారు. తమిళ ట్రైలర్‌ను విడుదల చేసిన హీరో విశాల్ మాట్లాడుతూ “యష్ నాకు సోదరుడితో సమానం. భాషా పరమైన సరిహద్దులను ఈ సినిమా చెరిపేస్తుంది. ఈ సినిమా ప్రేక్షకులకు పెద్ద ట్రీట్‌”అని చెప్పారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ “నాలుగేళ్ల జర్నీ ఈ సినిమా. మొదట కన్నడలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. కానీ నిర్మాత ఈ సినిమా చూశాక తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయాలనుకున్నారు. దీంతో విశాల్, సాయికొర్రపాటి, అనిల్ తాండన్ ఆయా భాషల్లో సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకు రావడంతో సినిమా స్పాన్ పెరిగింది. ఇది చాలా గ్రేట్ సినిమా అవుతుందనే నమ్మకం ఉంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హిందీ ట్రైలర్‌ను ఏఏ ఫిల్మ్ అధినేత అనిల్ తాండన్ విడుదల చేశారు.

KGF ( Kolar Gold Field ) is a Big Treat To Audience

Telangana News

Comments

comments