Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

మహాగణపతి తొలిపూజలో పాల్గొన్న గవర్నర్ దంపతులు

Khairatabad-Ganesh-2016హైదరాబాద్: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతికి గవర్నర్ నరసింహన్ దంపతులు తొలిపూజ చేశారు. రాజ్‌భవన్ నుంచి మండపం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఎల్‌ఎ రామచంద్రారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్ఛరణల మధ్య వినాయకుడికి తొలిపూజ నిర్వహించారు. మహాగణపతిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఖైరతాబాద్ పరిసరాలు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. ఈసారి భక్తులకు ఖైరతాబాద్ గణనాథుడు 58 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా దర్శనమిస్తున్నాడు. వినాయకుడికి ఇరువైపుల శ్రీలంక శాంకరీ దేవి, జమ్మూకశ్మీర్ సరస్వతి దేవిల విగ్రహాలను ప్రతిష్టించారు.

Comments

comments