Home తాజా వార్తలు ‘శ్రీ చండీకుమార మహాగణపతి’గా ఖైరతాబాద్ గణేష్

‘శ్రీ చండీకుమార మహాగణపతి’గా ఖైరతాబాద్ గణేష్

Khairatabad-Ganesh

హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న వినాయకుడి విగ్రహానికి సంబంధించిన చిత్రపటాన్ని శనివారం విడుదల చేసింది. ఈసారి స్వామివారు శ్రీచండీకుమార అనంత మహాగణపతిగా దర్శనమివ్వనున్నారు. 57 అడుగుల ఎత్తుతో గణేషుడి విగ్రహం ఉండనుంది. విగ్రహానికి కుడివైపున మహా శివుడు, ఎడమ వైపు మహిషాసురమర్ధిని రూపాలు ఉండనున్నాయి. ఈ మేరకు ఉత్సవ కమిటీ ప్రకటన విడుదల చేసింది.