Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

తొలి పూజ అందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి

Khairtabad-Ganesha

ఖైరతాబాద్ భారీ గణనాధుడు కాల సర్ప మహాగణపతిగా భక్తులకు దర్శనమించారు. ఎడవవైపు నందిపై కొలువుదీరిన శివపార్వతులు, కుడివైపు శ్రీనివాస కళ్యాణ ఘట్టాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఏడు తలల సర్పం నీడలో గౌరీతనయున్ని ఏర్పాటు చేశారు. పదకొండ రోజుల పాటు పూజలు అందుకోనున్న భారీ గణనాధుడికి గురువారం ఉదయం 5 గంటల నుంచి పూజ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ సంవత్సరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు తొలి పూజ చేశారు.  57 అడుగుల ఎత్తులో కొలువైన మహాగణపతి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తుండటంతో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని సైతం నియమించింది. ప్రభుత్వం భక్తులకు ఇబ్బందులు కలగకుండా భారీ కేడ్లు, రూట్‌మ్యాప్ సిద్ధ్దం చేసింది.

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భారీ కండువా, జంధ్యం….

ప్రతీ ఏడాది మాదిరిగా ఖైరతాబాద్ నియోజక వర్గ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏకదంతునికి 75 అడుగుల భారీ కండువ, జంధ్యంతో పాటు ముత్యాభిషేకం, కంకనాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్. రాములు, ఐఎఎస్ అధికారి పార్థసారధి, అడ్వకేట్ జనరల్ బండ శివనంద ప్రసాద్, డిసిపి విశ్వప్రసాద్, తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణలు విచ్చేసి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కండువా, గాయిత్రి జంధ్యం, పట్టువస్త్రాలను రాజ్‌దూత్ చౌరస్తా నుంచి వేదపండితుల మంత్రోచ్చరణలు, మంగళవాయిధ్యాలు, సాంప్రదాయ నృత్యాలతో స్వామి చెంతకు తీసుకవచ్చారు.

ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వాలంటరీలు….

భారీ గణనాథుడి వద్ద చిన్నపాటి సమస్యలు సైతం తలెత్తకుండా ఉత్సవ కమిటీ ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకుంటోంది. ఇందులో భాగంగా పోలీసులకు సహకరించేందుకు వాలెంటరీలను నియమించారు. స్వామికి స్వచ్చందంగా సేవ చేయాలని ముందుకు వచ్చే యువకులకు ఐడీ కార్డులను ఇచ్చి ఈ విధుల్లో వినియోగించుకుంటున్నారు.

భారీ గణనాధుడికి 250 కేజీల లడ్డు ప్రసాదం….

హైదరాబాద్ మెహిదీపట్నంకు చెందిన భక్తుడు శ్రీకాంత్ 250 కేజీల లడ్డును స్వామి వారికి సమర్పించారు.

Comments

comments