Home తాజా వార్తలు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం

GANAPATIహైదరాబాద్ : ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. కలశపూజ పూర్తి చేసి విగ్రహాన్ని వాహనంపైకి చేర్చారు. ప్రధాన విగ్రహంతో పాటు బాలాజీ, గోవర్ధనగిరి ఘట్టాలు ముందుకు సాగుతున్నాయి. వర్షం కారణంగా మహాగణపతి శోభాయాత్ర కొంత ఆలస్యమవుతోంది. ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మీరా టాకీస్ , లక్డీకాపూల్ మీదుగా శోభాయాత్ర ఎన్‌టిఆర్ మార్గ్‌కు చేరుకోనుంది. మధ్యాహ్నంలోగా మహాగణపతి నిమజ్జనానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.