Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

ఆ హీరోతో డేటింగ్

Kiara-advani

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని మహేష్‌బాబు నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ  ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అందరూ క్యూట్, స్వీట్  అనుకునేలోపు ‘లస్ట్ స్టోరీస్’ అనే  వెబ్ సిరీస్‌తో అందరికీ షాక్ ఇచ్చింది. ఇందులో హాట్ హాట్‌గా నటించిన ఈ అమ్మడి పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. ఇక కియారా ప్రస్తుతం బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో పడిందని,  డేటింగ్ చేస్తోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇద్దరూ గాఢమైన ప్రేమలో మునిగి తేలుతున్నారని అంటున్నారు. గతంలో సిద్ధార్థ్ అలియాభట్‌తో ప్రేమాయణం నడిపాడు. ఆతర్వాత జాక్విలిన్ ఫెన్నాండెజ్‌తో కూడా రొమాన్స్ చేశాడు. ఇప్పుడు కియారా అద్వానీ వంతు వచ్చింది. మరి వీరి ప్రేమ ప్రయాణం ఎంత కాలం కొనసాగుతుందో చూడాలి.

Comments

comments