Home సినిమా ఖుషీ ఖుషీగా కైరా అద్వాని

ఖుషీ ఖుషీగా కైరా అద్వాని

kiara

ఏ హీరోయిన్‌కైనా టాలీవుడ్ డెబు మూవీ బ్లాక్‌బస్టర్ కావడమంటే అది అదృష్టంగానే చెప్పుకోవాలి. ఆ అదృష్టాన్ని దక్కించుకున్న బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని. తెలుగులో తన మొదటి సినిమా ‘భరత్ అనే నేను’లో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సరసన నటించి బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడే రామ్‌చరణ్,- క్రేజీ కాంబినేషన్‌లో ఓ లక్కీ ఆఫర్‌ను ఆమె అందుకుంది. ఇది చాలదు అన్నట్టు రాజమౌళి మల్టీస్టారర్ కోసం నిర్మాత డి.వి.వి.దానయ్య కైరాను హీరోయిన్‌గా ఎంపికచేసినట్టు సమాచారం. ‘భరత్ అనే నేను’లో ఈ భామ గ్లామర్, నటనకు మంచి మార్కులే పడ్డాయి. టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీనిచ్చిన కైరాకు ముందు ముందు మరిన్ని భారీ ఆఫర్లు వచ్చేలా ఉన్నాయి. కొత్తదనం కోరుకుంటున్న వాళ్లు కైరా వంటి అందగత్తెలకు స్వాగతం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకపక్క పూజాహెగ్డే ఇలాగే ఆఫర్ల మీద ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా రానున్న రోజుల్లో కైరా అద్వాని ఫిల్మ్‌మేకర్స్‌కు బెస్ట్ ఛాయిస్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. బాలీవుడ్‌లో అవకాశాలు అంతగా లేక వేచి చూసిన ఈ భామ సౌత్‌లో తనకు ఈ రేంజ్‌లో అవకాశాలు ఖుషీగా ఉంది. అయితే రాజమౌళి సినిమాలో ఈ బ్యూటీ చరణ్‌కు జోడీగా నటిస్తుందా లేక ఎన్టీఆర్ పక్కన ఉంటుందా అనేది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.