Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

గిన్నిస్‌కు ఎక్కిన కిచిడీ

KICHIDI

ఢిల్లీ : రెండు డజన్ల మంది చెఫ్‌లు కలిసి 918 కిలోల కిచిడీని వండేశారు. ఢిల్లీలోని వరల్డ్ ఫుడ్ ఇండియా ఫెయిర్ వేదికగా వండిన ఈ కిచిడీ గిన్నిస్ రికార్డుకు ఎక్కింది. ప్రముఖ చెఫ్ సంజీవ్‌కపూర్ నేతృత్వంలో జరిగిన ఈ కిచిడీ తయారీలో కేంద్రమంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తదితరులు పాల్గొన్నారు. వెయ్యి లీటర్ల సామర్థం ఉన్న బాణలిలో ఈ కిచిడీని వండారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల సమక్షంలో ఈ కిచిడీని తయారు చేశారు. 800 కిలోల కిచిడీని మాత్రమే తయారు చేస్తామని నిర్వాహకులు ముందుగా ప్రకటించారు. అయితే 918 కిలోల కిచిడీని తయారు చేసి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించారు. ఈ విషయాన్ని గిన్నిస్ అధికారులు ధ్రువీకరించి , పత్రాన్ని అందించారు. కిచిడీని భారత బ్రాండ్‌గా ప్రపంచానికి తెలియజేసేందుకే ఈ ప్రయత్నం చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కిచిడీని కార్యక్రమానికి హాజరైన వారికి, భారత్‌లోని వివిధ దేశాల దౌత్య కార్యాలయాల సిబ్బందికి పంచారు. కిచిడీ తయారీ చేసే విధానాన్ని తెలిపే పత్రాన్ని కూడా విడుదల చేశారు.

 Kichidi got Place in Guinness Book

Comments

comments