Home జాతీయ వార్తలు పసికందు హత్య

పసికందు హత్య

MURDERకోల్‌కతా : మగబిడ్డ పుడుతుందనుకుంటే, మళ్లీ ఆడపిల్లే పుట్టిందని రోజుల పసికందును కన్నతల్లిదండ్రులే పీకనులిమి చంపేశారు. ఈ సంఘటన పశ్చిమబెంగాల్‌ళో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మిడ్నాపూర్ జిల్లాకు చెందిన దుర్గాశంకర్ , రీకూ దంపతులకు ఇటీవల మూడో సంతానం కలిగింది. అంతకుముందు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడోసారైనా మగబిడ్డ పుడుతాడని ఆశించారు. కనీ మళ్లీ ఆడపిల్లే పుట్టింది. దీంతో నిరాశ చెందిన భార్యభర్తలు 22రోజుల శిశువుని గొంతు నులిమి చంపేశారని పోలీసులు తెలిపారు. ఈ దంపతులను అరెస్ట్ చేసి, విచారణ చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.