Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

సెమీస్‌లోనే శ్రీకాంత్, సింధు ఔట్

Kidambi Srikanth, PV Sindhu Defeats in Malaysia Open 2018 Semifinals

కౌలాలంపూర్: భారత స్టార్ ఆటగాళ్లు కిదాంబి శ్రీకాంత్, పివి సింధు మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీస్‌లో ఓటమి పాలయ్యారు. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన కెంటో మొమొట చేతిలో వరుస సెట్లలలో 13-21, 13-21 తేడాతో శ్రీకాంత్ ఓడిపోయాడు. మ్యాచ్ ప్రారంభం నుంచి ప్రత్యర్థి దూకుడుగా ఆడటంతో శ్రీకాంత్‌కు ఓటమి తప్పలేదు. దీంతో సెమీస్‌లోనే శ్రీకాంత్ ఇంటిముఖం పట్టాడు. మరోవైపు మహిళల సింగిల్స్ సెమీస్‌లో తైపి క్రీడాకారిణి తాయ్ జూ చేతిలో 21-15, 19-21, 21-11 తేడాతో సింధు పరాజయం పాలైంది. మొదటి సెట్‌లో తాయ్ గెలవగా, రెండో సెట్‌ను సింధు సొంతం చేసుకుంది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్‌లో తైపి ప్లేయర్ ధాటిగా ఆడటంతో సింధుకు ఓటమి తప్పలేదు.

Comments

comments