Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఇండోనేషియా ఓపెన్ విజేత శ్రీకాంత్

  • సాటోకు మహిళా టైటిల్

Kidambi-Srikanth

జకర్తా: భారత స్టార్ కిదంబి శ్రీకాంత్ ప్రతిష్టాత్మకమైన ఇండోనేషియా ఓపె న్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో తెలుగు తేజం శ్రీకాంత్ 21-11, 21-19 తేడాతో జపాన్ ఆటగాడు కజుమసా సకాయిను చిత్తు చేశాడు. కాగా, మహిళల విభాగంలో జపాన్‌కు చెందిన సయాకా సాటో ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ శ్రీకాంత్ ప్రారంభం నుంచే చెలరేగి ఆడాడు. తొలి గేమ్‌లో శ్రీకాంత్‌కు ఎదురేలేకుండా పోయింది. చూడచక్కని షాట్లతో చెలరేగిన శ్రీకాంత్ ఏ దశలోనూ ప్రత్యర్థిని కోలుకోని వ్వలేదు. అతని దూకుడుముందు సకాయి ఎదురు నిలువలేక పోయాడు. అద్భుత షాట్లతో అలరించిన శ్రీకాంత్ 21-11తో గేమ్‌ను సొంతం చేసుకు న్నాడు. కానీ, రెండో గేమ్‌లో మాత్రం శ్రీకాంత్‌కు ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. సకాయి పుంజుకోవడంతో గేమ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఇద్దరు కూడా ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో పో రు నువ్వానేనా అన్నట్టు కొనసాగింది. మరోవైపు కీలక సమయంలో సకా యి చెలరేగడంతో ఒక దశలో శ్రీకాంత్ 6-11తో వెనుక బడ్డాడు. కానీ, మళ్లీ పుంజుకుని ఆడిన శ్రీకాంత్ పైచేయి సాధించాడు. చివరి వరకు ఆధి క్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగిన శ్రీకాంత్ 21-19తో గేమ్‌ను గెలిచి టైటిల్ సొంతం చేసుకున్నాడు. శ్రీకాంత్ కెరీర్‌లో ఇది మూడో సూపర్ సిరీస్ టైటిల్ కావడం విశేషం.
ఛాంపియన్ సాటో
మరోవైపు మహిళల సింగిల్స్‌లో జపాన్ క్రీడా కారిణి సయాకా సాటో టైటిల్ గెలుచుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో సాటో 21-13, 17-21, 21-19తో తేడాతో ఐదో సీడ్ షూజి హ్యూన్(కొరియా)ను ఓడించింది. ను వ్వానేనా అన్నట్టు సాగిన ఈ సమయంలో సాటో ఒత్తిడిని తట్టుకోవడంలో సఫలమైంది. దీంతో సాటోకు టైటిల్ దక్కింది. ప్రారంభ గేమ్‌లో సాటో చెలరేగి ఆడింది. అద్భుత షాట్లతో ప్రత్య ర్థిని ముప్పుతిప్పలు పెడుతూ ముందుకు సాగింది. ఇదే క్రమంలో 21-13తో గేమ్‌ను సొంతం చేసుకుంది. కానీ రెండో గేమ్‌లో సాటోకు చుక్కెదు రైంది. అద్భుతంగా పుంజుకున్న కొరియా స్టార్ హ్యూన్ 21-17తో గేమ్‌ను గెలుచుకుంది. దీంతో ఫలితం కోసం మూడో గేమ్ అనివార్యమైంది. ఇందు లో కూడా పోరు ఉత్కంఠభరితంగా సాగింది. అయితే చివరి వరకు ఆధిక్యా న్ని కాపాడుకోవడంలో సఫలమైన సాటో 21-19తో గేమ్ దక్కించుకుని ఛాంపియన్‌గా అవతరించింది.

Comments

comments