Home తాజా వార్తలు మూగవాడైన భర్తను చంపిన భార్య

మూగవాడైన భర్తను చంపిన భార్య

Boy Murder in Rangareddy

అడ్డగూడూరు: యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం మానాయికుంటలో గురువారం దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి మూగవాడైన భర్తను భార్య చంపింది. ప్రియుడితో అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం రామన్న పేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Killed Husband by Wife in Addagudur

Telangana news