Home అంతర్జాతీయ వార్తలు పౌరులను చంపి …

పౌరులను చంపి …

isis-agent-image-done-11బాగ్దాద్ : ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ పౌరులను చంపేసిన వీడియో విడుదల చేసింది. గూఢచారులుగా భావిస్తున్న ఐదుగురు వ్యక్తులను ఉగ్రవాదులు ప్రజలు చూస్తుండగా కాల్చి చంపారు. 12 నిమిషాల నిడివి గల ఈ వీడియోను ఐఎస్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రస్థావరాలపై అమెరికా చేస్తున్న వైమానిక దాడుల కారణంగా జరిగిన విధ్వంసాన్ని కూడా వీడియోలో చూపించారు. అదేవిధంగా చనిపోయిన చిన్నారుల మృతదేహాలను చూపించారు. నారింజ రంగు జంప్‌సూట్స్‌లో ఐదుగురు వ్యక్తులు నిలబడి ఉండగా, ఉగ్రవాదులు వారి వెనుక నిలబడి హతమార్చారు. ఇరాక్‌లో ఐఎస్ ఉగ్రవాదులు అరాచకాలకు పాల్పడుతున్న విషయం విదితమే. ఇటీవల బాగ్దాద్‌లో జరిగిన ఐఎస్ దాడుల్లో 94 మంది చనిపోయారు.