Home అంతర్జాతీయ వార్తలు సంస్కరణలు తీసుకొస్తే నా కుమారుడ్ని కాల్చిపారేయండి

సంస్కరణలు తీసుకొస్తే నా కుమారుడ్ని కాల్చిపారేయండి

re-formsపాంగ్యాంగ్ : ఉత్తర కొరియాలో  మళ్లీ సంస్కరణలు తీసుకురావాలని ప్రయత్నిస్తే తన కుమారుడిని కాల్చిపారేలా యని ఆ దేశ   వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ తన అనుచరులకు, అధికారులకు ఆదేశాలు ఇచ్చాడు. అందుకోసం వారందరికీ వెండితో తయారుచేసిన ప్రత్యేక తుపాకీలు అందజేశారని ఉత్తర కొరియాలో ఇటీవల విడుదలైన పుస్త కాల్లో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. ప్రస్తుతం ఉత్తర కొరియా పాలన మొత్తం కిమ్ ఇల్ సంగ్ వంశం సాగిస్తోంది. జంగ్ ఇల్ సంగ్ మరణాంతరం ఆ బాధ్యతలను కిమ్ జంగ్ ఇల్, ఆ తర్వాత అంటే  ప్రస్తుతం కిమ్ జంగ్ ఉన్ పరిపాలన సాగిస్తున్నారు. తన మరణం అనంతరం కూడా ప్రస్తుత విధానంలోనే దేశం నడవాలని,  తన మరణాంతరం సంస్కరణలు తీసుకొచ్చి దేశ పాలన విషయాల్లో మార్పులు చేసేందుకు తన వారసులు ప్రయత్నిస్తే కాల్చి పారేయండని   చెప్పినట్లు ఆ పుస్తకంలో పేర్కొన్నారు. రా జంగ్ ఇల్ అనే దక్షిణ కొరియా మాజీ నిఘా చీఫ్ ఆర్మీ అధికారి ఈ పుస్తకాన్ని రాశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్పులుచేర్పులకు ప్రయత్నించి సోవి యట్ యూనియన్ ఎంత పతనమైందో కిమ్ ఇల్ సంగ్ స్వయంగా చూశారని, ఈ నేపథ్యంలోనే తన అనంతరం వచ్చే వారసుడు దేశంలో స్టాలినేతర విధానాలు తీసుకురావాలని ప్రయత్నిస్తే దేశం విచ్ఛిన్నమయిపోతుందని భా వించి అలా తన వారుసుడు ప్రయత్నిస్తే కాల్చి పారేయండి అని  తుపాకులు ఇచ్చినట్లు చెప్పారు.