Home అంతర్జాతీయ వార్తలు మాట నిలబెట్టుకోకుంటే మూల్యం తప్పదు

మాట నిలబెట్టుకోకుంటే మూల్యం తప్పదు

kim jong and trumpఅమెరికాకు ఉత్తర కొరియా నియంత హెచ్చరిక

సియోల్: నూతన సంవత్సరం సందర్భంగా ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ అమెరికాకు తాజా హెచ్చరికలు జారీచేశారు. అమెరికాతో సుహృద్భావ సంబంధాలను తాము కోరుకుంటున్నప్పటికీ యావత్ ప్రపంచం ముందు చేసిన వాగ్దానాలను అమెరికా నెరవేర్చని పక్షంలో అందుకు తగిన పర్యవసానాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండక తప్పదని కిమ్ మంగళవారం హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి కూడా ఉత్తర కొరియాపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని అమెరికాపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిపింది.

మంగళవారం ఉత్తర కొరియా ప్రజలనుద్దేశించి కిమ్ ప్రసంగిస్తూ యావత్ ప్రపంచం ముందు చేసిన వాగ్దానాలను అమెరికా నెరవేర్చకుండా తమపై ఆంక్షలు, ఒత్తిళ్లు కొనసాగాలని పట్టుబడితే తమ దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకోవడానికి కొత్త దారిని పరిశీలించక తప్పదని అన్నారు.

అమెరికా, ఉత్తర కొరియా మధ్య దౌత్యపరమైన సయోధ్య కుదిరిన దాదాపు ఏడాది తర్వాత కిమ్ నుండి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. గత జూన్‌లో సింగపూర్‌లో సమావేశమైన కిమ్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియలో అణ్వస్త్ర నిరాయుధీకరణకు సంబంధించి ఒక ఒప్పందంపై సంతకం చేశారు. కాగా, ట్రంప్‌ను మరోసారి కలుసుకోవడానికి తాను సిద్ధమని, అంతర్జాతీయ సమాజం హర్షించే విధంగా తమ దేశం తీసుకున్న చర్యలను ట్రంప్ ముందు ఉంచుతామని కిమ్ చెప్పారు.

Kim Jong Warns US