Home ఛాంపియన్స్ ట్రోఫీ పంజాబ్‌కు కీలకం

పంజాబ్‌కు కీలకం

  • ముంబైతో పోరు

kings-XI-punjabముంబయి: ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలం టే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కింగ్స్ లెవన్ పంజాబ్ గురువారం పటిష్టమైన ముంబైతో తలపడనుంది. ఇప్పటికే ప్లేఆఫ్‌కు చేరిన ముంబైకు ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా పెద్ద గా పోయే దేమి ఉండదు. అయితే పంజాబ్‌కు మాత్రం ఈ పోరు చావోరే వోగా మారింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగి న కిందటి మ్యాచ్ లో అద్భు త విజయం సాధించి మంచి ఊపుమీ దున్న పంజాబ్‌కు ముంబైను ఓడించడం కష్టమే మి కాకపో వచ్చు. అయితే కీలక ఆటగా ళ్లు ఆమ్లా, డేవిడ్ మిర్రర్ తదితరులు జట్టును వీడ డం కాస్త ఆందోళన కలిగించే అం శం. మరోవైపు కెప్టెన్ మా క్స్‌వెల్ ఫాంలో కి రావడం జట్టు కు కలిసి వచ్చే అంశం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయ గలిగే సత్తా కలిగిన మాక్స్‌వెల్ చెలరేగితే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు తప్పవు. షాన్ మార్ష్ కూడా ఈ మ్యాచ్‌లో చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతను విజృంభిస్తే ఆపడం ఎంత బౌలర్‌కైన కష్టమే. ఇప్పటి వరకు ఆశించిన విధంగా రాణించని మార్ష్ ఈ మ్యాచ్‌లో మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. న్యూజిలాండ్ స్టార్ మార్టిన్ గుప్టిల్ కూడా భారీ ఇన్నింగ్స్ కోసం తహతహలాడు తున్నాడు. అతను చెలరేగితే పంజాబ్‌కు భారీ స్కోరు ఖాయం. విధ్వంసక బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన గుప్టిల్ ఈ మ్యాచ్‌లో పంజాబ్‌కు కీలకంగా మారాడు. అతను శుభా రంభం అందిస్తే తర్వాత వచ్చే వారిపై భారం తగ్గి వేగంగా ఆడే అవకాశం ఉంటుంది. మన్నాన్ వోహ్రా, అక్షర్ పటేల్, వృద్ధిమాన్ సాహా తదితరులతో పంజా బ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఇక, బౌలింగ్‌లో కూడా పంజాబ్ బలంగానే కనిపిస్తోంది. కిందటి మ్యాచ్‌లో కీలక సమయంలో పంజాబ్ బౌల ర్లు అద్భుతంగా రాణించారు. ఒత్తి డిలోనూ కుదురుగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించారు. సందీప్ శర్మ, మోహిత్ శర్మ, మాట్ హెన్రి, రాహుల్ తెవాటియా, స్వప్నిల్ సింగ్ వంటి నాణ్యమైన బౌలర్లు అందుబాటులో ఉన్నారు. అంతేగాక, కెప్టెన్ మాక్స్‌వెల్ కీలక సమయంలో వికెట్లు తీస్తూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు.
తేలిగ్గా తీసుకోవడం లేదు..
మరోవైపు ఇప్పటికే ప్లేఆఫ్‌కు చేరిన ముంబై ఈ మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకోవడం లేదు. ఇందులోనూ గెలిచి అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రోహిత్ సేన చాలా పటిష్టంగా ఉంది. కిరొన్ పొలార్డ్, లెండిల్ సిమన్స్, పార్థివ్ పటేల్, జోస్ బట్లర్, కృనాల్ పాండ్యా, రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా వంటి మ్యాచ్ విన్నర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. వీరిలో ఏ ఇద్దరు చెలరేగినా ముంబైకు విజయం నల్లేరుపై నడకే. బౌలింగ్‌లోనూ బుమ్రా, మలింగ, హర్భజన్, కరణ్‌శర్మ వంటి స్టార్లు జట్టుకు అండగా నిలువనున్నారు. రెండు జట్లు కూడా విజయంపై కన్నేయడంతో పోరు హోరాహోరీగా సాగడం ఖాయం.