Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

పంజాబ్ బోణి

Maxwell

రాణించిన మ్యాక్స్‌వెల్, మిల్లర్
బెన్ స్టోక్స్ హాఫ్ సెంచరీ

ఇండోర్ : ఐపిఎల్-10 సీజన్‌లో భాగంగా ఇండోర్‌లో హోల్కర్ క్రికెట్ మైదానంలో శనివారం రైజింగ్ పుణె సూపర్‌జెయింట్‌తో జరిగిన నాల్గో మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ శుభారంభం చేసింది. లక్ష ఛేదనలో 6 వికెట్ల తేడాతో పుణెపై ఘన విజయాన్ని సాధించింది. కెప్టెన్ మ్యాక్స్‌వెల్ అద్భుత ఇన్నింగ్స్ (20 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్) 44 పరుగులు చేసి అజేయంగా నిలవగా, డేవిడ్ మిల్లర్ (27 బంతుల్లో 1 ఫోరు, 2 సిక్స్) 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇరువురి భాగస్వామ్యంలో ఐదో వికెట్‌కు 25 బంతుల్లో 50 పరుగులు జోడించారు. 164 పరుగుల విజయలక్షంతో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 19.0 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి సూపర్‌జెయింట్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో విజయంతో పంజాబ్‌కు రెండు పాయింట్లు లభించాయి.

కింగ్స్ ఎలెవన్ జట్టు ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన మనన్ వోహ్రా 14 పరుగులకే నిష్క్రమించాడు. ఆ తరువాత సాహా ఇమ్రాన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయి 13 పరుగులకే రెండో వికెట్‌గా చేతులేత్తేశాడు. ఓపెనర్ ఆటగాడు హసీమ్ ఆమ్లా కూడా స్వల్ప స్కోరు (28) కే మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అక్సర్ పటేల్ (24) పరుగులకే చేతులేత్తేశాడు. పంజాబ్ జట్టు 85 పరుగుల వద్ద నాలుగు వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. అనంతరం బరిలోకి దిగిన కెప్టెన్ మ్యాక్స్‌వెల్ అద్భుత ఇన్నింగ్స్‌తో స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. పుణె బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ రెండు వికెట్లు తీసుకోగా, చాహర్, డిండా తలో వికెట్ తీసుకున్నారు. పంజాబ్ ఆటగాడు, కెప్టెన్ మ్యాక్స్‌వెల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

స్టోక్స్, తివారి రాణించినా..
రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ ఆటగాళ్లు బెన్ స్టోక్, మనోజ్ తివారి అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించడంతో భారీ స్కోరుదిశగా పరుగులు పెట్టింది. టాస్ గెలిచి పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, పుణె బ్యాటింగ్ చేపట్టింది. ముంబయితో జరిగిన రెండో మ్యాచ్‌లో భారీ స్కోరు రాబట్టిన పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఈ మ్యాచ్‌లో స్వల్ప స్కోరుతోనే సరిపెట్టకున్నాడు. గత మ్యాచ్‌లో విజృంభించిన అజింక్య రహానె కూడా ఓపెనర్‌గా బరిలోకి దిగి స్మిత్ బాటలో 19 పరుగులకే చేతులేత్తేశాడు. ఆ తరువాత వచ్చిన బెన్ స్టోక్స్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా, ధోనీ 5 పరుగులకే నిష్క్రమించాడు. స్టోక్స్‌కు జోడీగా మనోజ్ తివారి ఐదో వికెట్‌కు 28 బంతుల్లో 50 పరుగులు జోడించారు. ఆది నుంచి నిలకడగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించిన స్టోక్స్‌కు పంజాబ్ బౌలర్లు షాక్ ఇచ్చారు. మొత్తం (32 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్)లతో హాఫ్ సెంచరీ (50) పూర్తి చేసిన స్టోక్స్ అక్సర్ పటేల్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తరువాత క్రిస్టేయన్ 17 పరుగులు చేయగా, రజత్ బాటియా (0) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ప్రత్యర్థి జట్టు పంజాబ్‌కు 164 పరుగుల లక్ష్యాన్ని పుణె నిర్దేశించింది. పంజాబ్ బౌలర్లలో సందీప శర్మ రెండు వికెట్లు తీసుకోగా, అక్సర్ పటేల్, నటరాజన్, స్టోయినీస్, స్వప్నిల్ సింగ్ తలో వికెట్ తీసుకున్నారు.

స్కోరు బోర్డు: 
రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ ఇన్నింగ్స్ : అజంక్య రహానె (సి) స్టోయినీస్ (బి) నటరాజన్ ; 19, మయాంక్ అగర్వాల్ (బి) సందీప్ శర్మ ; 0, కెప్టెన్ స్టీవ్ స్మిత్ (సి) వొహ్రా (బి) స్టోయినీస్ ; 26, బెన్ స్టోక్స్ (సి) & (బి) అక్సర్ పటేల్; 50, ఎంఎస్ ధోనీ (సి) & (బి) స్వాప్నిల్ సింగ్; 5, మనోజ్ తివారీ నాటౌట్ ; 40, క్రిస్టేయిన్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) సందీప్ శర్మ; 17, రజత్ బాటియా నాటౌట్ ; 0. ఎక్స్‌ట్రాలు: 6,
మొత్తం: ( 20 ఓవర్లకు 6 వికెట్లు) 163 పరుగులు.
వికెట్ల పతనం: 1-1, 2-36, 3-49, 4-71, 5-132, 6-162.
పంజాబ్ బౌలర్లు: సందీప్ శర్మ : 4-0-33-2, మోహిత్ శర్మ : 4-0-34-0, అక్సర్ పటేల్ : 4-0-27-1, టి.నటరాజన్ : 3-0-26-1, స్టోయినీస్ : 3-0-28-1, స్వప్నిల్ సింగ్ : 2-0-14-1.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: హసీమ్ ఆమ్లా (సి) స్టోక్స్ (బి) చాహర్ ; 28, మనన్ వోహ్రా (సి) మనోజ్ తివారీ (బి) డిండా ; 14, వృద్ధిమాన్ సాహా (బి) ఇమ్రాన్ తాహిర్; 14, అక్సర్ పటేల్ (సి)& (బి) ఇమ్రాన్ తాహిర్; 24, కెప్టెన్ మ్యాక్స్‌వెల్ ; 44 నాటౌట్, డెవిడ్ మిల్లర్ ; 30 నాటౌట్.
ఎక్స్‌ట్రాలు: 10
మొత్తం: ( 19 ఓవర్లకు 4 వికెట్లు) 164 పరుగులు
వికెట్ల పతనం: 1-27, 2-49, 3-83, 4-85.
పుణె బౌలర్లు: ఎబి డిండా: 3-0–26-1, క్రిస్టేయిన్ : 2-0-24-0, బెన్ స్టోక్స్ : 4-0-32-0, ఇమ్రాన్ తాహిర్ 4-0-29-2, చాహర్ : 4-0-32-1, బాటియా : 2-0-20-0.

Comments

comments