Search
Saturday 22 September 2018
  • :
  • :

కోల్‌కతాకు షాక్

  • లిన్‌ మెరుపులు వృథా
  • పంజాబ్ గెలుపు

Punjab-Won

మొహాలి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మంగళ వారం కీలక మ్యాచ్‌లో కింగ్స్ లెవన్ పంజాబ్ 14 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో పంజాబ్ ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. 168 పరుగుల లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఆఖర్లో పంజాబ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. దీంతో క్రిస్ లిన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకుండా పోయింది. లిన్ 52 బంతుల్లో ౩సిక్సర్లు, మరో 8 ఫోర్లతో 84 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది.
మాక్స్‌వెల్ మెరుపులు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌కు ఓపెనర్లు గుప్టిల్, వోహ్రా మెరుగైన ఆరంభాన్నే ఇచ్చారు. వోహ్రా ప్రారంభం నుంచే చెలరేగి ఆడగా, గుప్టిల్ రక్షణాత్మక బ్యాటింగ్‌ను కనబ రిచాడు. ధాటిగా ఆడిన వోహ్రా 4బౌండరీలతో 25 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే గుప్టిల్ (12) కూడా వెనుది రిగాడు. తర్వాత వచ్చిన షాన్ మార్ష్ పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు. 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ దశలో జటును ఆదుకునే బాధ్యతను మాక్స్‌వెల్ తనపై వేసుకున్నాడు. వికెట్ కీపర్ సాహా అతనికి అండగా నిలిచాడు. ఇద్దరు పంజాబ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. మాక్స్‌వెల్ దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించాడు. వ్వింసక ఇన్నింగ్స్ ఆడిన మాక్స్‌వెల్ 25 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 44 సాధించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన సాహా రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో 38 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ స్కోరు 167 పరుగులకు చేరింది. కోల్‌కతా బౌలర్లలో కుల్దీప్, వోక్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
స్కోరుబోర్డు
కింగ్స్ లెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: మార్టిన్ గుప్టిల్ ఎల్బీ-బి నరైన్12, మన్నాన్ వోహ్రా (సి) ఉతప్ప (బి) ఉమేశ్ 25, షాన్ మార్ష్ (బి) వోక్స్ 11, సాహా (స్టంప్డ్) ఉతప్ప (బి) కుల్దీప్ యాదవ్ 38, మాక్స్‌వెల్ (సి) వోక్స్ (బి) కుల్దీప్ యాదవ్ 44, అక్షర్ పటేల్ నాటౌట్ 8, స్వప్నిల్ సింగ్ (బి) వోక్స్ 2, తెవాటియా నాటౌట్ 15, ఎక్స్‌ట్రాలు 12, మొత్తం 20 ఓవర్లలో 167/6. ఉమేశ్ యాదవ్ 3-0-25-1, గ్రాండొమ్ 4-0-37-0, నరైన్ 4-0-27-1, వోక్స్ 4-0-20-2, రాజ్‌పుత్ 2-0-17-0, కుల్దీప్ యాదవ్ 3-0-34-2.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సునీల్ నరైన్ (బి) మోహిత్ 18, క్రిస్ లిన్ రనౌట్ 84, గౌతం గంభీర్ (సి) మార్ష్ (బి) తెవాటియా 8, రాబిన్ ఉతప్ప (సి) పటేల్ (బి) తెవాటియా ౦, మనీష్ పాండే (సి) పటేల్ (బి) హెన్రి 18, గ్రాండొమ్ నాటౌట్ 11, యూసుఫ్ పఠాన్ (సి) మాక్స్‌వెల్ (బి) మోహిత్ వోక్స్ నాటౌట్ 8, ఎక్స్‌ట్రాలు 4, మొత్తం 20 ఓవర్లలో 153/6.
బౌలింగ్: సందీప్ శర్మ 4-0-31-0, హెన్రి 3-0-30-1, మోహిత్ శర్మ 3-0-24-2, అక్షర్ పటేల్ 4-0-28-0, తెవాటియా 4-0-18-2, స్వప్నిల్ సింగ్ 2-0-19-0.

Comments

comments