Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

లయన్స్‌పై ‘పంజా’బ్

పరుగుల తేడాతో గుజరాత్‌పై విజయం సెంచరీతో అదరగొట్టేసిన ఆమ్లా
ఛేదనలో రైనాసేన చిత్తు కార్తీక్.. హాఫ్ సెంచరీ వృథా

పంజాబ్ బిగించిన ఉచ్చులో లయన్స్ విలవిల లాడింది. ఆమ్లా అద్భుతమైన ఇన్నింగ్స్‌తో పంజాబ్‌కు మరో విజయాన్ని అందించగా, వరుస పరాజయాల తో వెనుకబడిన గుజరాత్‌ను ఆదుకునే క్రమంలో దినేశ్ కార్తీక్ ఒంటిరిపోరాటం వృథాగా పోయింది. కింగ్స్‌ఎలెవన్ పంజాబ్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించడంతో 26 పరుగుల తేడాతో మ్యా క్స్‌వెల్‌సేన ముచ్చటగా మూడో విజయాన్ని సొంతం చేసుకుంది. పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించి హాఫ్ సెంచరీతో అదరగొట్టేసిన ఆమ్లాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 

Punjab

రాజ్‌కోట్: పంజాబ్ పంజా విసిరింది. గుజరాత్ లయన్స్‌తో రాజ్‌కోట్ గా మ్యాచ్‌లో 26 పరుగులతో తేడాతో కింగ్స్ వన్ సాధించింది. ఇప్పటికే ఈ సీజన్‌లో రెండు విజయాలు సాధించిన మ్యాక్స్‌వెల్‌సేన ముచ్చటగా మూడో విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెన ర్ హాసీమ్ ఆమ్లా (40 బంతుల్లో 9ఫోర్లు, 2 సిక్స్) 65 పరుగులు చేయగా, అక్సర్ పటేల్ (17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్) 34 పరుగులు చేసిన వేళ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసి మరో విజయాన్ని సాధించింది.ఈ మ్యాచ్‌లో విజయంతో పంజాబ్‌కు 2 పాయిం ట్లు దక్కగా, ఆమ్లాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. తొలుత టాస్ గెలిచిన గుజరాత్ ఫీల్డింగ్ ఎంచుకోగా, పంజాబ్ ఓపెనర్లుగా మనన్ వోహ్రా, ఆమ్లా బరిలోకి దిగారు.

మనన్ ఆదిలోనే (2) పరుగులకే నిష్క్రమించగా, ఆమ్లా ఆది నుంచి నిలకడగా ఆడుతూ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో పంజాబ్ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తూ అదరగొట్టేశాడు. ఈ క్రమంలో వోహ్రా స్థానంలో వచ్చిన షాన్ మార్ష్ (24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) 30 పరుగు లు చేసి పర్వాలేదనిపించాడు. అయితే అనూహ్యంగా ఆండ్రూ టై బౌలింగ్‌లో సురేశ్ రైనాకు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అనం తరం బరిలోకి దిగిన కెప్టెన్ మ్యాక్స్‌వెల్ ఆమ్లాకు జతగా ఇన్నింగ్స్‌ను చక్కది ద్దే ప్రయత్నం చేశాడు. ఆటగాళ్లు ఇద్దరూ నిష్క్రమించినప్పటికీ పట్టువదలని ఆత్మవిశ్వాసంతో ఆమ్లా విజృంభిస్తూ లయన్స్ బౌలర్లకు చుక్కలు చూపించా డు.

తనదైన శైలిలో బ్యాటింగ్‌ను ఝళిపిస్తూ దూకడుగా కదిలాడు. ఈ క్రమంలో శుభామ్ అగర్వాల్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా ఆమ్లా పెవిలియన్‌కు చేరాడు. అనంతరం మ్యాక్స్‌వెల్ అదే దూకుడుతో ఇన్నింగ్స్‌ను కొనసాగించగా, రవీంద జడేజా బౌలింగ్‌లో (18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్) 31 పరుగులు చేసి ఎల్‌బిడబ్లుగా వెనుదిరిగాడు. వికెట్ రూపంలో వెనుదిరి గాడు. అనంతరం వచ్చిన స్టాయినిస్ (7), వృద్థిమాన్ సాహా (10) పరుగులు చేయగా, మోహిత్ శర్మ (4) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసి ప్రత్యర్థి జట్టు గుజరాత్ కు 189 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. లయన్స్ బౌలర్లలో ఆండ్రూ టై రెండు వికెట్లు తీసుకోగా, అగర్వాల్, నాథూ సింగ్, రవీంద్ర జడేజా, డిఆర్ స్మిత్ తలో వికెట్ తీసుకున్నారు.

లయన్స్ విలవిల.. కార్తీక్ ఒంటరిపోరు

189 పరుగుల విజయ లక్షంతో బరిలోకి దిగిన రైనాసేన పంజాబ్ దెబ్బకు లయన్స్ విలవిల లాడిం ది. దినేశ్ కార్తీక్ (44 బంతుల్లో 6 ఫోర్లు) 58 పరు గులు సాధించి హాఫ్ సెంచరీతో ఆకట్టు కున్నాడు. కెప్టెన్ సురేశ్ రైనా (24 బంతుల్లో 4 ఫోర్లు) 32 పరుగులు చేయగా, ఆండ్రూ టై (22) పరుగులు సాధిం చారు. ఆది నుంచి నిలకడగా ఆడుతూ కార్తీక్ ఒక్కడే ఒంటరిపో రాటం చేసి అజేయంగా నిలిచాడు. లయన్స్ మిగతా ఆటగాళ్ల పేలవ ప్రదర్శనతో కార్తీక్ హాఫ్ సెంచరీ శ్రమ వృథా అయింది. ఓపెనర్‌గా వచ్చిన మెక్‌కలమ్ (6), ఫించ్ (13), జడేజా (9), డిఆర్ స్మిత్ (4) పరుగులకే పరిమిత మ య్యారు. ఛేదనలో లయన్స్‌ను విజయతీరాలకు చేర్చేందుకు కార్తీక్ చివరి వరకు శ్రమించినా ఫలితం గుజరాత్‌ను వరించలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసి లయన్స్ పంజాబ్ చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూసింది. పంజాబ్ బౌలర్లలో సందీప్ శర్మ, కరియప్ప, అక్సర్ పటేల్ రెండు వికెట్లు తీసుకోగా, మోహిత్ శర్మ ఒక వికెట్ తీసుకున్నాడు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: మనన్ వోహ్రా (సి) కార్తీక్ (బి) నాథూ సింగ్ ; 2, హాసీమ్ ఆమ్లా (సి)&(బి) శుభామ్ అగర్వాల్ ; 65, షాన్ మార్ష్ (సి) రైనా (బి) టై; 30, మ్యాక్స్‌వెల్ ఎల్‌బిడ బ్లు జడేజా ; 31, స్టాయినిస్ (సి) మెక్‌కలమ్ (బి) టై; 7, అక్సర్ పటేల్ (సి) ఫించ్ (బి) స్మిత్; 34, వృద్థిమాన్ సాహా రనౌట్ (బసిల థంపి); 10, మోహిత్ శర్మ నాటౌట్; 4. ఎక్స్‌ట్రాలు: 5. మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లు) 188 పరుగులు. వికెట్ల పతనం: 1-11, 2-81, 3-128, 4-132, 5-157, 6-174, 7-188. గుజరాత్ బౌలర్లు : 4-0-42-1, నాథూ సింగ్ 2-0-7-1, సురేశ్ రైనా 1-0-6-0, బసిల్ థంపి 4-0-44-0, ఆండ్రూ టై 4-0-35-2, రవీంద్ర జడేజా 4-0-32-1, డిఆర్ స్మిత్ 1-0-18-1.

గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: మెక్‌కలమ్ ఎల్‌బిడబ్లు (బి) సందీప్ శర్మ; 6, ఫించ్ (సి) స్టాయినిస్ (బి) శర్మ ; 13, సురేశ్ రైనా (సి) మ్యాక్స్‌వెల్ (బి) పటేల్; 32, దినేశ్ కార్తీక్ నాటౌట్ ; 58, రవీంద్ర జడేజా (సి)&(బి) కరియప్ప; 9, డిఆర్ స్మిత్ (సి) స్టాయినిస్ (బి) పటేల్; 4, అక్షదీప్ నాథ్ ఎల్‌బిడబ్లు (బి) కరియప్ప; 0, ఆండ్రూ టై (బి) సందీప్ శర్మ; 22, బసిల్ థంపి నాటౌట్; 11. ఎక్స్‌ట్రాలు: 7. మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లు) 162 పరుగులు. వికెట్ల పతనం: 1-6, 2-46, 3-70, 4-95, 5-102, 6-102, 7-137. పంజాబ్ బౌలర్లు: సందీప్ శర్మ 4-0-40-2, మోహిత్ శర్మ 4-0-25-1, టి. నటరాజన్ 3-0-22-0, కరియప్ప 4-0-24-2, అక్సర్ పటేల్ 4-0-36-2, స్టాయినిస్ 1-0-12-0.

Comments

comments