Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

పంజాబ్ ఆశలు సజీవం

KXIP-Winముంబయి: ప్లేఆఫ్ రేసులో కింగ్స్ లెవన్ పంజాబ్ మరో ముందడుగు వేసింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ ఏడు పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. 231 పరుగుల లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 223 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.
ప్రారంభం నుంచే..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన కింగ్స్ లెవన్ పంజాబ్‌కు ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, వృద్ధిమాన్ సాహా కళ్లు చెదిరే శుభారంభాన్ని అందించారు. ఇద్దరు తొలి బంతి నుంచే చెలరేగారు. భారీ షాట్లతో ముంబై బౌలర్లను హడలెత్తించారు. విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగిన గుప్టిల్ 18 బంతుల్లోనే ఐదు బౌండరీలు, ఒక సిక్సర్‌తో 36 పరుగులు సాధించాడు.
సాహా జోరు..
గుప్టిల్ ఔటైనా పంజాబ్ జోరు కొనసాగింది. కెప్టెన్ మాక్స్‌వెల్, వికెట్ కీపర్ సాహా మరింత దూకుడుగా ఆడారు. ఇద్దరు వరుస ఫోర్లు, సిక్సర్లతో ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు. తన మార్క్ షాట్లతో చెలరేగిన మాక్స్‌వెల్ స్కోరును పరిగెత్తించాడు. భారీ సిక్సర్లతో విధ్వంసం సృష్టించిన మాక్స్‌వెల్‌ను అద్భుత బంతితో బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేశాడు. ధాటిగా ఆడిన మాక్స్‌వెల్ 21 బంతుల్లో రెడు ఫోర్లు, మరో ఐదు భారీ సిక్సర్లతో 47 పరుగులు సాధించాడు. ఇక, కీలక ఇన్నింగ్స్ ఆడిన సాహా 31 బంతుల్లోనే 8ఫోర్లు, సిక్స్‌తో అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తర్వాత వచ్చిన షాన్ మార్ష్ కూడా దూకుడుగా ఆడాడు. సాహాతో కలిసి స్కోరును పరిగెత్తించాడు. 16 బంతుల్లోనే రెండు సిక్సర్లతో 25 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరోవైపు అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన సాహా 55 బంతుల్లోనే 11ఫోర్లు, మరో మూడు భారీ సిక్సర్లతో 93 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అక్షర్ పటేల్ 19(నాటౌట్) తనవంతు పాత్ర పోషించడంతో పంజాబ్ స్కోరు ఐదు వికెట్లకు 230 పరుగులకు చేరింది. ఒకవైపు పంజాబ్ రికార్డు స్కోరు సాధించిన ఈ మ్యాచ్‌లో బుమ్రా అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. నాలుగు ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
సంక్షిప్త స్కోర్లు:
కింగ్స్ లెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 230/3(వృద్ధిమాన్ సాహా 93(నాటౌట్), మాక్స్‌వెల్ 47, గుప్టిల్ 36, షాన్ మార్ష్ 25, అక్షర్ పటేల్ 19(నాటౌట్)

Comments

comments