Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కిరణ్ కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక

Kiran-Kumar-Reddy

న్యూఢిల్లీ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీలో తిరిగి చేరారు. శుక్రవారం ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కిరణ్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎపి వ్యవహారాల ఇంచార్జి ఉమెన్‌చాందీ, అశోక్ గెహ్లా ట్, పళ్లంరాజు, రఘువీరారెడ్డి తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు. రాహుల్‌తో భేటీ అయ్యేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారమే ఢిల్లీ చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నకిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరనున్నారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.ఇటీవల పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కిరణ్ కుమార్‌రెడ్డితో భేటీ కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.  దీంతో ఆర్నెల్లుగా వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. అయితే ఇది అధికారిక చేరికకాదని పార్టీ వర్గాలు చెబుతున్నా యి. ఆంధ్రప్రదేశ్‌లో భారీ సభ ఏర్పాటుచేసి అక్కడ రాహుల్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోవాలని కిరణ్ భావిస్తున్నట్లు సమాచారం. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రం గా నష్టపోయిన కాంగ్రెస్ తిరిగి పుంజుకోవాలని యోచిస్తోంది. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి సేవలు పార్టీకి అవసరమని నేతలు భావిస్తున్నారు. అందుకే సీనియర్ నేతలు పలు విడతలుగా ఆయనతో భేటీ అయి పార్టీలో చేరాలని కోరా రు. సుదీర్ఘ మంతనాల అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లోచేరాలని నిర్ణయం తీసుకున్నారు.

Comments

comments