Home అంతర్జాతీయ వార్తలు చికాగో సెక్స్ రాకెట్‌లో కిషన్ దంపతులు

చికాగో సెక్స్ రాకెట్‌లో కిషన్ దంపతులు

18న శిక్షలు ఖరారు

Chicago

మన తెలంగాణ/హైదరాబాద్: చికాగోలో ఇటీవల వెలుగు చూసిన సినీ తా రల సెక్స్ రాకెట్ కేసులో అక్కడి కోర్టు కిషన్ దంపతులను దోషిగా తేల్చింది. వీరికి ఈ నెల 18న శిక్షలు ఖరారు చేయనుంది. చికాగోలో తెలుగు నటీమణుల వ్యభిచారాన్ని హోంలాండ్ సెక్యూరిటీ ఇన్విస్టిగేషన్ స్పెషల్ ఏజెంట్ బ్రి యాన్ గిన్ గుట్టు రట్టు చేసిన విషయం తెలిసిందే. అమెరికాలో స్థిరపడ్డ కిష న్ అతని భార్య చంద్రకళలను మూడు నెలల క్రితం అక్కడి పోలీసులు అరె స్టు చేశారు. గత నెలలో వీరిపై చార్జీషీట్ వేయడంతో  సెక్స్‌రాకెట్ విషయం బయటికి పొక్కింది.  నటీమణులను అమెరికాకు రప్పించి వారితో వ్యభిచా రం చేయించేవారని అక్కడి పోలీసుల దర్యాప్తులో తేలింది. నటీమణులకు వీ సా మంజూరు చేసేందుకు ఈ దంపతులు నకిలీ తెలుగు సంఘాల పేర్లతో లెటర్‌ప్యాడ్‌లు, ఆయా సాంస్కృతిక  కార్యక్రమాల పేర్ల నకిలీ కరపత్రాలు సృష్టించి వీసాలు ఇప్పించేవారని కూడా తేలింది.

సినీ తారలను ట్రాప్ చేసి భయపెట్టినట్లు అక్కడి పోలీసులకు కిషన్ మాట్లాడిన ఆడియో టేప్‌లు కూడా లభ్యమయ్యాయి.  అందులో కిషన్ దంపతులు  అమెరికాకు వచ్చే నటీమణులకు ఎలాంటి షరతులు, బెదిరింపులు విధించారో స్పష్టంగా ఉంది. ఈ ఆడి యో టేప్‌లు కిషన్ దంపతులవేనని అక్కడి ఫోరెన్సీక్ రిపోర్టులో తేలింది.  2016 నవంబర్ 8వ తేదీ నుంచి 2017 నవంబర్ 29వ తేది మధ్య priceli ne.com వెబ్‌సైట్ ద్వారా 85  విమాన టిక్కెట్లు బుక్ చేసినట్లు  అక్కడి పోలీసుల దర్యాప్తులో తేలింది. కిషన్ ఇమెయిల్ (mkishan 3456@gmail.co m) నుంచి కూడా పోలీసులకు కీలక సమాచారం లభ్యమైంది. అయితే ఈ కేసులో హైదరాబాద్ నుంచి అమెరికాకు వచ్చి వ్యభిచారం చేసిన వారి పేర్లను మాత్రం అక్కడి పోలీసులు గోప్యంగా ఉంచారు. వీరిని కేసులో సాక్షులుగా చూపించారు. దోషులుగా తేల్చిన అక్కడి కోర్టు కిషన్ దంపతులకు 18న శిక్షలు ఖరారు చేయనుంది.