Search
Monday 24 September 2018
  • :
  • :

మేడి పండులా ఈటల బడ్జెట్ : కిషన్‌రెడ్డి

BJP Leader, Kisan Reddy, Said such, Attacks, Democracy, Unfortunate,Telangana news,Telugu news,TS news,Telangana Assembly Session 2018,Telangana Assembly news,Today Telangana Assembly news,TS assembly news,Telangana Assembly Session,Telangana Assembly Latest news,Assembly news of Telangana,Telangana Assembly Session Budget,Telangana Assembly news Today,Telangana Assembly news

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మేడిపండులా ఉందని బిజెపి ఎంఎల్‌ఎ కిషన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం అసెంబ్లీలో మంత్రి ఈటల రాజేందర్, శాసనమండలిలో డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌పై కిషన్‌రెడ్డి స్పందించారు. బడ్జెట్ బారెడు … కేటాయింపులు జానెడుగా బడ్జెట్ ఉందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు పూర్తి కావాలంటే మరో మూడు లక్షల కోట్లు అవసరం పడుతుందని ఆయన చెప్పారు. బడ్జెట్‌లో చెప్పిన లెక్కల ప్రకారం 85 వేల ఖాళీలు ఉన్నాయని, ఇదే పాలన మున్ముందు సాగితే ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు మరో 14ఏళ్లు పడుతుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల రుణ మాఫీ ఇంకా పూర్తి కాలేదన్నారు. కాకిలెక్కలతో ప్రజలను మోసం చేయాలని కెసిఆర్ ప్రభుత్వం చూస్తోందని ఆయన ధ్వజమెత్తారు. కెసిఆర్ ప్రజావ్యతిరేక పాలనను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

Kishan Reddy Comments on Etala Budget

Comments

comments