Home సినిమా అవన్నీ సాధారణమే

అవన్నీ సాధారణమే

Anu-Emmanuel

అందాల తార అను ఇమ్మాన్యుయల్  ఒక చిన్న చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సక్సెస్ కాకపోయినప్పటికీ ఆమెకు అనూహ్యంగా మంచి ఆఫర్లు  వచ్చాయి. ఈ భామ పవన్‌కళ్యాణ్‌తో ‘అజ్ఞాతవాసి’, అల్లు అర్జున్‌తో ‘నా పేరు సూర్య’ చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. అయితే ఈ రెండు సినిమాలు సక్సెస్‌కాలేకపోయాయి. అయినప్పటికీ అను ఇమ్మాన్యుయల్‌కు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల నాగచైతన్యతో కలిసి చేసిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ భామ. ఇక తన ప్రతి సినిమాలో స్కిన్ షోతో పాటు ముద్దు సీన్లతో రెచ్చిపోతోంది ఈ అమ్మడు. అయితే ఇవన్నీ కమర్షియల్ సినిమాల్లో సాధారణమేనని అంటోంది అను ఇమ్మాన్యుయల్. “నేను నటించిన సినిమాలు ఫ్లాప్ అలయినా కూడా నా పాత్రలకు మంచి పేరు వచ్చింది. నా నటన నచ్చడం వల్లే నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి.  ఫ్లాపుల నుండి చాలా నేర్చుకున్న నేను కొత్త సినిమాల ఎంపికలో జాగ్రత్తగా ఉంటున్నాను. ఇక కమర్షియల్ సినిమాల్లో ముద్దు సీన్లు, స్కిన్ షో సాధారణమే. కథ డిమాండ్ మేరకే అలాంటి సన్నివేశాలు చేయాల్సి వస్తోంది”అని చెప్పింది అను ఇమ్మాన్యుయల్.

Kissing Scenes are Common in Commercial Movies 

Telangana News