Home లైఫ్ స్టైల్ నవ వధువుకు కిచెన్ టిప్స్…

నవ వధువుకు కిచెన్ టిప్స్…

Kitchen tips for the new bride

పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. అంగరంగ వైభవంగా వివాహం జరుపుకుంటారు. అప్పటి వరకు అమ్మగారింట్లో మహారాణిలా పెరిగిన అమ్మాయికి, అత్తవారింట్లో ఎలా మెలగాలో, ఎలా వారిని మెప్పించాలో తెలియడానికి కొంచెం సమయం పడుతుంది. అప్పటి వరకు వంటింట్లో అడుగు పెట్టని వారు కొందరైతే, పుట్టింట్లో తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని రుచి చూపించినవారు మరికొందరుంటారు. ఎలాంటివారైనా అత్తింటివారిని తన వంటతో ఎలా మెప్పించాలో కొంచెం తెలుసుకుంటే మంచిదంటున్నారు నిపుణులు. నవ వధువు అత్తవారింట్లో కిచెన్ క్వీన్ కావాలనుకుంటే, ఇక్కడ ఇచ్చిన టిప్స్ ఎంతో కొంత ఉపయోగపడతాయి

పెరుగును పలుచగా చేయాలంటే అందులో నీళ్లకు బదులుగా పాలు కలపండి. ఎండుమెంతిని ప్యాన్‌పై లైట్‌గా వేయించి వేయండి.
* ఇంట్లో పన్నీర్ చేస్తే మిగిలిన నీటిని మైదా పిండి,గోధుమపిండి, పూరీపిండిని కలపడానికి వాడండి.
*ఆవ ఆకుల కూర చేసేటప్పుడు అందులో బీట్‌రూట్‌ను వేయండి. రుచి రెట్టింపవుతుంది. కోఫ్తాలు చేసేటప్పుడు డ్రై ఆల్‌బుఖారా లేదా చింతపండు వేసి రోల్ చేయండి.
*ఊరగాయ మసాలాను జల్లెడతో జల్లించాలి. మసాలాలో రుచి ప్రకారం ఉప్పువేసి పచ్చిమిర్చిలో నింపి, భోజనంతో పాటు సర్వ్ చేయండి.
* దోసెలు వేసే పెనంపై రాత్రే నూనె రాసి పెట్టండి. దోసెలు అతకవు.
* పరాటాల ప్రతీ పొరపై నెయ్యి రాసి పొడి పిండి చల్లండి.
*ఖీర్ లేదా పాయసం ఎక్కువ పలుచగా అయితే కాస్త కస్టర్డ్ పౌడర్ కలపండి. కూర దోసకాయని ఉడికించండి.నెయ్యిలో శనగపిండి వేయించి అందులో ఉప్పు, కారం, ఆమ్‌చూర్, పచ్చిమిర్చి వేయండి. దోసకాయ తడి ముక్కలను శనగపిండిలో వేసితిప్పండి. శనగపిండి అతుక్కుంటుంది. పరాటాలతో సర్వ్‌చేయండి.
* తందూరి రొట్టెలు మిగిలితే పొద్దున పెనంపై నెయ్యి రాసి వేడి చేయండి. పరాటాలు రుచితో ఉంటాయి.
* రాజ్మా, అలసంద/ బొబ్బర్లు, నల్ల కాబూలీశనగలు,కాబూలీ శనగలు ఒక గిన్నెడు ఉంటే, అందులో1 గిన్నె నిండా టొమాటో పూరీ వేయండి. గ్రేవీ బాగా అవుతుంది.
* కూరలో పచ్చి పన్నీర్ వేస్తుంటే దాన్ని పసుపు కలిపిన నీటిలో 15 నిమిషాలు నానబెట్టి వేయండి.
* రాజ్మాను ఉడికించి నీళ్లు వడకట్టి పక్కన పెట్టండి. మసాలా వేయించి రాజ్మా వేసి 5నిమిషాలు వరకు ఉడికించాలి. మసాలా రాజ్మాలో కలిసిపోతుంది. మిగిలిన నీటిని వేసి ఉడికించాలి.
* పలావ్ కోసం ఉప్పు వేసి బియ్యాన్ని ఉడికించండి. కూరగాయలు ఫ్రై చేయండి. కలపండి. పలావ్ చాలా బాగుంటుంది.
* పిండి కలిపే సమయం లేకపోతే పిండిని నానబెట్టి ఉంచండి. 15నిమిషాల తర్వాత చేతికి నెయ్యి రాసుకుని పిసకండి. 2నిమిషాల్లో పిండి రెడీ అవుతుంది.
* ఆలూ బోండాలు, క్యాబేజ్, పన్నీర్ పకోడీలు చేసేటప్పుడు శనగపిండిలో చిటికెడు తీయని సోడా వేయండి. పకోడీలు గుల్లగా వస్తాయి.
* బంగాళ దుంపలు ఉడికించి, ఫ్రిజ్‌లో పెట్టండి. నచ్చిన ఆకారంలో కట్ చేసుకుని దోరగా వేయించండి. స్వీట్, స్పైసీ చట్నీతో సర్వ్ చేయండి.
* అటుకులను నీళ్లలో నానబెట్టండి. పాలు మరిగించి అందులో అటుకులు,చక్కెర,డ్రై ఫ్రూట్స్ వేయండి. త్వరగా ఖీర్ రడీ అవుతుంది.
* స్వీట్ చట్నీలో కృత్రిమ రంగు వేయకుండా, కాస్త కారంపొడి కలపండి.
* బెల్లం డిష్‌లు చేయడానికి ముందు దాన్ని తురిమి కొన్ని నీళ్లలో కలిపి వేడి చేయాలి. మట్టి,చెత్త అడుగుకి చేరతాయి. వడకట్టి ఉపయోగించండి.
* కుల్ఫీ తయారుచేసేటప్పుడు చిటికెడు తీయని సోడా పాలలో కలపాలి. మీగడ రాదు.
* దుస్తులపై నెయ్యి లేదా నూనె పడితే వెంటనే గోధుమ పిండి, మైదా,టాల్కంపౌడర్ ఏది ఉన్నా దాన్ని మరకలపై చల్లండి. కొద్దిసేపటి తర్వాత బ్రష్‌తో శుభ్రం చేసి సబ్బుతో ఉతికేయండి.
* గ్యాస్ స్టవ్‌పై నెయ్యి పొరలా అయితే, దానిపై వంట సోడా చల్లి రుద్ది శుభ్రం చేయండి.
* వంటగదిలో పని అయిపోయాక తడి చేతులపై పిండి లేదా శనగపిండి రుద్దండి మురికంతా వదిలిపోతుంది.
* స్వీట్ చెట్నీ తయారు చేస్తే అందులో చిటికెడు ఉప్పు వేయండి. స్సైసీ చట్నీ చేస్తే అందులో అరచెంచా చక్కర కలపండి.

Kitchen tips for the new bride
Telangana News