Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

వరంగల్ కీర్తిప్రతిష్టలు ప్రతిబింబించేలా పతంగుల ఉత్సవాలు

Collector4

వరంగల్ బ్యూరో: పతంగుల ఉత్సవాలతో వరంగల్ కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేయాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ కాట అమ్రపాలి అధికారులకు సూచించారు. ఈనెల 17న జరిగే అంతర్జాతీయ పతంగుల ఉత్సవాలను పురస్కరించుకొని ఆఫాఖాన్ పౌండేష్ ఆస్ట్రేలియా ప్రతినిధి లీఫిషర్, డెవిడ్ కైట్ ప్లయర్స్ కన్సల్టెంట్ పవన్ (గుజరాత్), రాష్ట్ర పర్యాటకశాఖ ప్రతినిధి శశిధర్, జిల్లా ప్రతినిధులు వరంగల్ కోటను, హన్మకొండలోని ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు.

పతంగుల ఉత్సవాల సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో  కలెక్టర్ అమ్రపాలితో చర్చించారు. ఈ సందర్భంగా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి అంతర్జాతీయ పతంగుల ఉత్సవం గురించి ప్రతినిధులతో సమీక్షించారు. ఈ ఉత్సవంలో 31 దేశాలకు చెందిన అంతర్జాతీయ స్థాయి కైట్ ఫ్లయర్స్ 31 మంది, జాతీయ స్థాయి కైట్ ఫ్లయర్స్ 9 మంది మొత్తం 40 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వారు కలెక్టర్‌కు వివరించారు.

పతంగుల ఉత్సవం పురస్కరించుకొని 17వ తేది ఉదయం వరంగల్ కోటలో హెరిటేజ్‌వాక్ ఏర్పాటు చేసి కైట్ ఫ్లయర్స్, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు కోటను సందర్శించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. 17న ఉదయం 10 గంటల నుంచి పతంగుల ఉత్సవం ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల మైనాదంలో నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా టూరిజం అధికారి శివాజీ, సమాచార పౌర సంబంధాలశాఖ ఉప సంచాలకులు డిఎస్ జగన్, రోడ్లు, భవనాలశాఖ అధికారులు పాల్గొన్నారు.

Comments

comments