Home ఛాంపియన్స్ ట్రోఫీ కెకెఆర్ హ్యాట్రిక్.. ఢిల్లీపై ఘన విజయం

కెకెఆర్ హ్యాట్రిక్.. ఢిల్లీపై ఘన విజయం

Yusuf-Phatan-Manish-Pandey

న్యూఢిల్లీ : ఐపిఎల్10లో భాగంగా సోమవారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. 169 పరుగులు విజయ లక్షంతో బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు తొలుత కాస్త తడబడింది. బ్యాట్స్‌మెన్లు గంభీర్ 14, కొలిన్ 1, ఊతప్ప 4 పరుగులకే పెవిలియన్ బాట పట్టిన తరుణంలో మనీష్ పాండే (69) యూసుఫ్ పఠాన్ (59) అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టు విజయానికి తొడ్పడ్డారు. దీంతో కోల్‌కతా 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలింగ్‌లో జహీర్‌ఖాన్, కమిన్స్ చెరో రెండు వికెట్ల, మోరిస్, మిశ్రా తలో వికెట్ తీశారు. హాఫ్ సెంచరీ చేసి అద్భుతమైన బ్యాటింగ్ చేసిన మనీష్ పాండేకు మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డ్ దక్కింది.