Search
Tuesday 20 November 2018
  • :
  • :

కెకెఆర్‌కు ఎదురుదెబ్బ.. ఐపిఎల్‌కు లిన్ దూరం?

Chris-Lynn

ముంబయి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కెకెఆర్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెకెఆర్ జట్టు ఓపెనర్ క్రిస్ లిన్ గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లిన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతడు ఐపిఎల్ తరువాతి మ్యాచ్‌లలో పాల్గొనేది అనుమానమేనని నైట్‌రైడర్స్ యాజమాన్యం వెల్లడించింది.

కాగా లిన్ గుజరాత్ లయన్స్‌పై ఆడిన ఇన్నింగ్స్ ఈ సీజన్‌లో క్రికెట్ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. ఈ ఇన్నింగ్స్‌లో లిన్ 41 బంతులను ఎదుర్కొని అజేయంగా 93 పరుగులు చేయడం విశేషం. దీంతో ఒక్కసారిగా క్రిస్ లిన్ ఐపిఎల్10 సీజన్‌లో అందరీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. కానీ గాయం కారణంగా లిన్ ఈ సీజన్‌కు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు రావడం కెకెఆర్ అభిమానులను నిరాశలో ముంచేసిందనే చెప్పాలి.

Comments

comments