Home వార్తలు రోజర్ ఫెదరర్‌కి మోకాలి శస్త్ర చికిత్స

రోజర్ ఫెదరర్‌కి మోకాలి శస్త్ర చికిత్స

 నెలపాటు టెన్నిస్‌కు దూరం

rogerలండన్:  స్విజర్లాండ్‌కు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడా కారుడు రోజర్ ఫెదరర్ తన మోకాలు శస్త్ర చికిత్స కార ణంగా నెల రోజులపాటు ఆటకు దూరం కానున్నా డని, ప్రస్తుతం అతడు స్విజర్లాండ్‌లో చికిత్స చేయించుకుం టున్నట్లు అతడి ఏజెంట్ టోనీ గాడ్సిక్ గురువారం  రాయిటర్ వార్తా సంస్థకు చెప్పారు.  17 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన ఫెడరర్ గత వారం ఆస్ట్రేలియా ఒపెన్ సెమీ-ఫైనల్స్‌లో గాయపడ్డాడు. దాంట్లో అతడిని సెర్బియా టెన్నిస్ క్రీడాకారుడు నొవాక్ జొకోవిక్ పరాజితున్ని చేశాడు. ఈ సరికొత్త పరిణామంతో రోటర్‌డామ్‌లో జరుగనున్న ఎబిఎన్ అమ్రో వరల్డ్ టెన్నిస్ టోర్నమెంట్, ఫిబ్రవరిలో జరిగే దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్ నుంచి ఫెడరర్ తప్పుకున్నట్లే ! తన టెన్నిస్ కేరీర్‌లో ఇలా అనారోగ్యం కారణంగా ఆడకుండా ఉన్నది చాలా అరుదు. 2005లో ఆరు వారాలపాటు కాలి గాయం వల్ల, 2008లో వెన్ను నొప్పి కారణంగా మాత్రమే అతడు టెన్నిస్ కొంత కాలం దూరంగా ఉన్నాడు. అయితే మొత్తంగా చూస్తే మాత్రం మంచి ఆరోగ్యవంతుడైన క్రీడాకారుడతను. గాయాల కారణంగా ఫెడరర్ టెన్నిస్ పోటీలకు దూరం కావడం స్విస్ క్రీడాభిమానులకు నిరాశనే కలిగిస్తోంది. మార్చి నెలలో జరిగే ఇండియన్ వెల్స్ మాస్టర్స్ పోటీలకల్లా అతడు కోలుకుంటాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు.