Search
Wednesday 21 November 2018
  • :
  • :

కీచక ఖాకీ..!(వీడియో)

Kochi cop caught on camera inappropriately touching girls

కొచ్చి: బాధ్యతాయుతమైన పోలీసు ఉద్యోగంలో ఉన్న ఓ హోం గార్డు నిర్వాకం ఇది. మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఖాకీ కాస్తా కామంతో కళ్లు మూసుకుపోయి నడిరోడ్డుపై బాలికలను అసభ్యంగా తాకుతూ పైశాచిక ఆనందాన్ని పొందాడు. వివరాల్లోకి వెళితే… కొచ్చిలోని తివారాలో ఓ చర్చి ముందు శివకుమార్‌( 58) అనే హోమ్ గార్డు విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో బిజీగా ఉండే ఆ వీధిలో అటుగా వెళ్తున్న మహిళలు, బాలికలను అసభ్యంగా తాకుతూ వేధించాడు. 58 ఏళ్ల శివకుమార్ తన మనవరాళ్ల వయసులో ఉన్న విద్యార్థినులను కూడా వదల్లేదు. అయితే, ఇది గమనించిన అక్కడే ఓ వ్యక్తి తన మొబైల్ లో దీన్ని వీడియో తీసి అంతర్జాలంలో పెట్టాడు. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. సదరు హోమ్ గార్డుపై నెటిజన్లు తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పిస్తున్నారు. విషయం పోలీస్ ఉన్నతాధికారులకు తెలియడంతో శివకుమార్‌ను విధుల నుంచి తొలగించారు. అలాగే ఐపిసి 354, పోక్సో చట్టంలోని 7, 8 సెక్షన్ల కింద అతడిపై కేసులు నమోదు చేశారు.

Comments

comments