Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

కోదండరామ్ రాజీనామా ఆమోదం

Denial of Permission for Million March

హైదరాబాద్: టిజెఎసి ఛైర్మన్ పదవికి కోదండరామ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను ఐకాస కార్యవర్గం ఆదివారం ఆమోదం తెలిపింది. అలాగే కొత్త ఛైర్మన్‌ను ఎన్నుకుంది. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ… రాష్ట్రం సిద్ధించడంలో టిజెఎసి పాత్ర మరువలేనిదని కోదండరామ్ అన్నారు. 2009 నుంచి ఇప్పటి వరకు తనకు సహకరించినందుకు అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఐకాస లాంటి సంస్థలు దేశంలో మరెక్కడా లేవని, జెఎసితోనే తామంతా ప్రపంచానికి పరిచయమయ్యామని ఆయన గుర్తు చేశారు. ప్రజా ఉద్యమాలతో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేశామని పేర్కొన్నారు. రాజకీయాల్లో మార్పు కోసం టిజెఎసి నుంచి వైదొలుగుతున్నానని చెప్పారు. తార్నాకలోని సెయింట్ ఆన్స్ కాన్సలేట్‌లో టిజెఎసి విస్తృత స్థాయి సమావేశంలో కోదండరామ్ రాజీనామాను ఆమోదించారు. అనంతరం ఐకాస నూతన అధ్యక్షుడిగా రఘును ఎన్నుకున్నారు. రఘు ప్రస్తుతం విద్యుత్ జెఎసి అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే.

Comments

comments