Home తాజా వార్తలు భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న ప్రభుత్వం : కోదండరామ్

భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న ప్రభుత్వం : కోదండరామ్

Kodandaram Meet with Nayini Narasimha Reddy

హైదరాబాద్ : తమ పార్టీ తలపెట్టిన బహిరంగ సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం భావప్రకటన స్వేచ్ఛను హరించివేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. సభలు, సమావేశాలు పెట్టుకోడం రాజ్యాంగం కలిపించిన హక్కు అని ఆయన అన్నారు. దేశ భద్రతకు భంగం కలిగినప్పుడు మినహా , ప్రాథమిక హక్కులకు భంగం కలిగించరాదని ఆయన స్పష్టం చేశారు. సభకు అనుమతి నిరాకరిస్తూ పోలీసులు చెబుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన అన్నారు. తమ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా, తాము సభను నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో నియంత పాలన సాగుతుందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం పౌర హక్కులను కాలరాస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Kodandaram Comments on TS Government