Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

కోదండరాం కోసం పొన్నాల బలి

Ponnala-Laxmaiah

హైదరాబాద్: మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ మొండిచెయి చూపించింది. టిజెఎస్ నేత కొదండరాం కోసం పొన్నాలను కాంగ్రెస్ బలి ఇచ్చింది. దీంతో పొన్నాల వర్గీయలుఉ గందరగోళంలో పడ్డారు. జనగామ టికెట్‌ను పొన్నాలని కాదని కోదండరాంకు ఇస్తుండటంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో బిసిలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన సీటు కోసమో, తన రాజకీయ కోసమో తాను మాట్లాడటం లేదని పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో ఇప్పటికే బిసిలు రాజకీయంగా అభద్రతాభావంతో ఉన్నారని హెచ్చరించారు. ఇలాంటి సమయంలో ఒక సీనియర్ బిసి నాయకుడి సీటు రెడ్డి వర్గానికి కేటాయిస్తే పార్టీలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని సూచించారు. అనాలోచితంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తాను అనుకోవడం లేదని పొన్నాల పేర్కొన్నారు.

Kodandaram Concentrate on Ponnala Laxmaiah Seat

Telangana news

Comments

comments