Search
Friday 16 November 2018
  • :
  • :

కోదండరామ్ దీక్ష

విపక్షాలను ఒక్క త్రాటిమీదికి తెచ్చిన కోదండరామ్ దీక్ష

నేతల అరెస్టుపై ఇంటివద్ద నిరసన వ్రతం పూని విరమించిన జెఎసి సారథి

all-togetherహైదరాబాద్ : ప్రభుత్వ విధానాలకు నిరసనగా జెఎసి చైర్మన్ కోదండరామ్ చేపట్టిన దీక్ష రాష్ట్రంలోని ప్రతిపక్షాలను ఒక్క త్రాటిపైకి తీసుకువ చ్చింది. హైదరాబాద్‌లో గురువారం జెఎసి తలపెట్టిన ‘భూ నిర్వాసితుల’ ధర్నా కు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ధర్నాలో పాల్గొనేందుకు సిద్ధమవుతు న్న జెఎసి కార్యకర్తలు, భూనిర్వాసితులను జిల్లాల్లో పెద్ద ఎత్తున అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కోదండరామ్ అధ్యక్షతన ఆయన నివా సంలో జెఎసి స్టీరింగ్ కమిటీ అత్యవసర సమావేశమైంది. అరెస్టు చేసిన వారం దరినీ విడుదల చేసేంత వరకు నిరాహారదీక్ష చేయాలనే నిర్ణయం మేరకు కోదం డరామ్ తన నివాసంలోనే ఆకస్మికంగా ఉదయం పదిన్నర గంటలకు దీక్షను ప్రారంభించారు. సాయంత్రానికల్లా అరెస్టు చేసిన వారిని విడుదల చేసినట్లు సమాచారం అందడంతో, మరోసారి స్టీరింగ్ కమిటీ సమావేశమై దీక్షను విర మించాలని విజ్ఞప్తి చేసింది. ప్రముఖ విద్యా వేత్త చుక్కా రామయ్య సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కోదండరామ్‌కు మజ్జిగ ఇచ్చి దీక్షను విరమింపజేశారు.  రాజకీయపార్టీల నాయకులు, కాంగ్రెస్, టిడిపి, బిజెపి శాసనసభ్యులు, ప్రజా సంఘాలు, తెలంగాణ వాదులు పెద్ద సంఖ్యలో తార్నాకలోని కోదండరామ్ నివాసానికి వచ్చి దీక్షకు మద్దతు ప్రకటించారు. దీక్షా శిబిరానికి టిపిసిసి అధ్య క్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎల్‌పి నేత కె.జానారెడ్డి, పిసిసి వర్కింగ్ ప్రెసి డెంట్  భట్టివిక్రమార్క, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడతో పాటు పలువురు నాయకులు, టిడిపి ఎంఎల్‌ఎలు ఎ.రేవంత్‌రెడ్డి, సండ్రవెంకటవీర య్య, బిజెఎల్‌పి నేత జి.కిషన్‌రెడ్డి, ఎంఎల్‌సి రాంచంద్రారావు, సిపిఐ(ఎం) నేత సారంపల్లిమల్లారెడ్డి, సిపిఐ(ఎం.ఎల్-న్యూడెమోక్రసీ) నేత గోవర్ధన్‌లు వచ్చి కోదండరామ్ దీక్షకు మద్దతు ప్రకటించారు.
ఎంఎల్‌ఏలు టి.జీవన్‌రెడ్డి, డాక్టర్ గీతారెడ్డి, డి.కె.అరుణ,డాక్టర్ చిన్నారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి, వంశీచంద్‌రెడ్డి, శాసనమండలి సిఎల్‌పినేత మహ్మద్ అలీషబ్బీర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రంగారెడ్డి, ఆకుల లలిత, సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, వి.హన్మంతరావు, దాసోజుశ్రవన్, అద్దంకి దయాకర్, సిపిఐ నాయకులు పల్లా వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, పశ్యపద్మ, ఎన్. బాలమల్లేష్,తెలంగాణ ఉద్యమ వేదిక ప్రతినిధులు చెరుకుసుధాకర్‌రెడ్డి, ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి, న్యాయవాదులు, ఎంబిటి నేత అమ్జాదుల్లాఖాన్, రైల్వే, డాక్టర్, ఉపాధ్యాయ, విద్యార్థుల జెఎసి నేతలు దీక్షా శిబిరానికి సందర్శించారు.

Comments

comments