Home సూర్యాపేట కొడిగట్టిన గ్రామజ్యోతి

కొడిగట్టిన గ్రామజ్యోతి

jyothi* పేరుకే మిగిలిన గ్రామకమిటీలు
* నిధులు లేక నిర్వీర్యమైన గ్రామపాలన
* గ్రామజ్యోతి వెలుగు లేక విలవిల
* పస లేని పథకం అన్న ప్రజలు
* పరిపాలన వికేంద్రీకరణ ఉట్టి మాటే

మన తెలంగాణ/పెన్‌పహాడ్ :  ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామజ్యోతి పథకం అటకెక్కింది.పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాభివృద్ధితోనే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందిం దని భావించి రాష్ట్ర ప్రభు త్వం మానస పుత్రికగా గ్రామజ్యోతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ఈ గ్రామజ్యోతి పథకంలో క్షేత్రస్థాయిలో ప్రజలను భాగస్వాములుగా చేయడం వల్ల స్థానిక సమస్యలు, స్థానిక వనరులపై ఆ గ్రామప్రజలకు పూర్తిగా అవగాహన ఉండడం వల్ల వాటి వినియో గం, సమస్యల పరిష్కారంలో వారిని భాగస్వా మ్యులను చేసి ఉత్తమ ఫలితాలు పొందాలనే గొప్ప ఆశయంతో ప్రారంభమైన గ్రామజ్యోతి పథకంలో ఆశయాలుగా త్రాగునీరు, పారిశుద్ధ్దం, వైద్యం, పౌష్టికాహారం, విద్య, సామాజిక భద్రత, పేదరిక నిర్మూలన , సహజ వనరుల విభాగం, మౌలిక వసతుల కల్పన వంటి గొప్ప గొప్ప ఆశయాలను చేర్చి గ్రామాలను స్వయం సమృద్ధి, స్వయం పోషకా లుగా రూపుదిద్దుతామని చెప్పి రెండు సంవత్సరాలు కావస్తున్న ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే విధంగా ఉందనే భావన ప్రజల్లో నెలకొంది. గ్రామజ్యోతి పథకాన్ని అమలు చేయ డానికి ఒక్కో గ్రామంలో ఏడు కమిటీలు ఏర్పాటుచేసి ఒక్కో కమిటీ ఆధ్వ ర్యంలో అక్కడ గ్రామంలోని సమ స్యలను పరిష్కారం చేయాల నే ఉద్దేశ్యంతో కమిటీలు ఏర్పాటు చేసిన ఆ కమిటీ ల నిర్వహణలో గ్రామ సర్పంచ్,  , ఉపసర్పంచ్, వార్డు సభ్యులను, చైర్మన్ లుగా ఉంచి పంచాయితీ కార్యద ర్శులు, ఎఎన్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్త, ఆ ఏరియా హెడ్ మాస్టర్, వ్యవసాయ అధికారి కన్వీనర్‌లుగా ఏడు కమిటీలను ఏర్పాటు చేసి ఈ కమిటీల సమావేశంలో ఆ గ్రామ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో చర్చించి గ్రామ సమగ్రాభివృద్ధికి ప్రణాళిక ను రూపొందించి అందు బాటులో ఉన్న నిధులతో అవసరాల ప్రాధా న్యత ఆధారంగా పనులు చేపట్టి ఆ పనులు పారద ర్శకంగా జరిగేలా చూడడం ఆ కమిటీల బాధ్యత. ఇలా మండ లంలోని మొత్తం 17 గ్రామపం చాయి తీలు ఉండగా గ్రామపంచా యితీ కమిటీలు ఏర్పాటు చేసి, ఆ కమిటీ సభ్యులకు శిక్షణ అందించి ప్రజా ధనాన్ని వృధా చేయడం తప్ప ఆ కమిటీల వల్ల నేడు గ్రామ ప్రజలకు ఒరిగిం దేమి లేద ని ప్రజలు భావి స్తున్నారు. ఆ కమిటీ సభ్యులు నిధులు లేక ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపో యాయని ఆవేదన వ్యక్తం చేసు న్నారు. ఇప్పటికైన రాష్ట్ర ప్రభు త్వం పరి పాలన వికేంద్రీకరణ గ్రామాలకు జవస త్వాలు నిం పడానికి ప్రారంభించిన గ్రామజ్యోతి పథకంపై దృష్టి పెట్టి అది లక్షం చేరే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.