Search
Sunday 18 November 2018
  • :
  • :

విరాట్‌కు వీరునే స్ఫూర్తి

Virat_manatelangana copyచెన్నై : శ్రీలంక పర్యటనలో రాణించేందుకు భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను స్ఫూర్తిగా తీసుకోమని టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి భారత్-ఎ కోచ్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ హితబోధ చేశాడు. ఆసీస్-ఎతో జరిగిన రెండో అనధికార టెస్టుకు ప్రాతినిధ్యం వహించిన కోహ్లి ఆ సమయంలో తన బ్యాటింగ్ లోపాలపై భారత్-ఎ కోచ్ ద్రావిడ్‌తో సుదీర్ఘ మంతనాలు జరిపాడు. ఈ సందర్భంగా లంక పర్యటన(2008)లో భాగంగా గాలెలో సెహ్వాగ్(201 పరుగులు) ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని తనకు ద్రావిడ్ తెలిపినట్లు కోహ్లి చెప్పాడు. ‘2008 శ్రీలంక పర్యటనలో భారత్‌కు అజెంత మెండీస్‌తో కఠిన పరీక్ష ఎదురైంది. ఆ సిరీస్‌లో మెండీస్ భారత బ్యాట్స్‌మన్లను ముప్పుతిప్పలు పెట్టాడు. సిరీస్‌లో భాగంగా గాలెలో జరిగిన టెస్టులో మెండీస్ విజృంభణ(ఒకే ఇన్నింగ్స్‌లో ఆరువికెట్లు)కు ఓ ఎండ్‌లో టాపార్డర్ బ్యాట్స్‌మన్లు పెవిలియన్ చేరినా మరో ఎండ్‌లో వీరు భాయ్ మెండీస్‌పై ఎదురుదాడికి దిగి ద్విశతకాన్ని నమోదుచేశాడు. వీరు ఇన్నింగ్స్ గురించి ఇటీవలే ద్రావిడ్‌తో చర్చించాను. సెహ్వాగ్ కెరీర్‌లో అదే అత్యుత్తమ ఇన్నింగ్స్‌న ద్రావిడ్ నాతో చెప్పాడు’ అని కోహ్లి అన్నాడు. శ్రీలంక పర్యటనకు ముందు సెహ్వాగ్ ఇన్నింగే నాకు స్పూర్తి. జట్టు సభ్యులు కూడా లంక బౌలర్లను సమర్థవతంగా ఎదుర్కొవాలంటే సెహ్వాగ్ ఇన్నింగ్స్ చూడాల్సిందే.  ఆ మ్యాచ్‌లో సెహ్వాగ్ ఆడిన ప్రతి బంతినీ వీక్షించాను. టెస్టు క్రికెట్‌లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్న యువ ఆటగాళ్లు ఆ మ్యాచ్‌ను తప్పక చూడాలని తెలిపాడు. ఇక స్వీప్‌షాట్‌పై మాట్లాడిన కోహ్లి.. స్వీప్‌షాట్ మెరుగ్గా ఆడేందుకు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రస్తుత టీమిండియాలో అజింక్యారహానె స్వీప్‌షాట్‌ను ఆడడంలో దిట్ట. రోహిత్, మురళీ విజయ్ కూడా సీప్ షాట్ బాగానే ఆడుతారు. స్వీప్‌షాట్‌ను నా ఆయుధంగా వాడాలని భావిస్తున్నానని కోహ్లి అన్నాడు. స్పిన్‌పిచ్‌కు సహరించే శ్రీలంకలోనే ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగే అవకాశముందని కోహ్లి స్పష్టం చేశాడు. ఐదు రోజుల ఫార్మాట్‌లో 20 వికెట్లు పడగొట్టాలంటే ఐదు బౌలర్లతో బరిలోకి దిగితేనే సాధ్యమన్నాడు. ఒక బ్యాట్స్‌మెన్ తగ్గినా.. బౌలర్లుగా పరిగణిస్తున్న అశ్విన్, హర్భజన్, భువనేశ్వర్‌కు బ్యాటింగ్ చేసే సామర్థం వుందని తెలిపాడు.

Comments

comments