Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

అంతర్జాతీయ టి20ల్లో విరాట్ కోహ్లీ నం.1

* టాప్ 5లోకి అశ్విన్ పునరాగమనం
teamదుబాయ్: ఐసిసి టి20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి నం.1గా నిలిచాడు. ఆఫ్-స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలర్ల జాబితాలో 7వ స్థానం నుంచి తిరిగి టాప్5లోకి చేరాడు. కె.ఎల్.రాహుల్ 67వ స్థానం నుంచి 31వ స్థానానికి మారాడు. అమెరికాలోని లాడెర్‌హిల్స్‌లో వెస్టిండీస్, భారత్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో అజేయ శతకం చేయడంతో అతడి స్థానం అప్‌డేట్ అయింది. టి20 సిరీస్ తొలి మ్యాచ్‌లో మొత్తం 489 పరుగులు చేయగా, అందులో రాహుల్ అజేయంగా 110 పరుగులు చేశాడు. వెస్టిండీస్ 245/6 చేయగా దానికి జవాబుగా భారత్ 244 పరుగులు చేసింది. కేవలం ఒక్క పరుగుతో ఓడిన సంగతి తెలిసిందే. ఇక రెండో టి20 మ్యాచ్‌లో వాన కారణంగా ఆటను రద్దు చేశారు. వెస్టిండీస్ 1-0 ఆధిక్యంతో ఉండడంతో సిరీస్ వారి కైవసం అయింది. ఐసిసి వరల్డ్ టంటీ20లో వెస్టిండీస్ రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. సిరీస్‌కు ముందు భారత్ 128 పాయింట్లతో రెండో స్థానంలో ఉండింది. వెస్టిండీస్ భారత్ కంటే ఆరుపాయింట్లు వెనుక ఉండేది. కానీ ఇప్పుడు భారత్ 126 పాయింట్లు కలిగి ఉండగా, వెస్టిండీస 125 పాయింట్లు కలిగి ఉంది. జాబితాలో 132 పాయింట్లతో న్యూజిలాండ్ అగ్రశ్రేణిలో ఉంది.

Comments

comments