Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

సిక్సర్ల!… అబ్బే నా వల్ల కాదు

kohliమిర్పూర్: పరుగుల మెషిన్ అతనే టీం ఇండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. క్రీజులో కుదురుకుంటే ప్రత్యర్థి జట్టుకి ప్రమాదమే. ఎన్ని పరుగుల లక్ష్యానైనా అలోవకగా ఛేదించగల ఓర్పు-నేర్పు అతని సొంతం. అలాంటి కోహ్లీ సిక్సర్లు కొట్టడంలో మాత్రం కొంచెం వెనుకబడే ఉంటాడు. ఇప్పటి వరకు 33 టీ20 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ కేవలం 27 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న టీ20 ఆసియా కప్ టోర్నమెంట్ ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ…. అందరి బ్యాట్స్‌మెన్‌లాగా తాను సిక్సర్లు కొట్టడంలో కాస్తా వెనుకబడి ఉన్నానని, ఇప్పటికైతే సిక్సర్లు బాదడం తన వల్ల కాదన్నారు. అందుకే ఎక్కువ మొత్తంలో బౌండరీలు కొడుతూ స్కోర్ బోర్డుని పరుగెత్తిస్తానని చెప్పుకొచ్చారు. ఈ టీ20 ఫార్మాట్లో ఏ జట్టును చిన్న జట్టుగా భావించరాదని, తమదైన ఆటతో ఏ జట్టైన ఏ సమయంలోనైన చేలరేగి ఆడగలదని విరాట్ అన్నారు. ఇక బంగ్లాదేశ్‌లో టీం ఇండియా గతేడాది 1-2 తేడాతో వన్డే సిరీస్ కోల్పోవడాన్ని ప్రస్తావిస్తూ…తాము బంగ్లా బౌలర్ ముస్తాఫిజర్ అద్భుతమై బౌలింగ్ శైలి కారణంగానే సిరీస్ కోల్పోవాల్సి వచ్చిందన్నారు. అయితే నేటి నుంచి ప్రారంభమవుతున్న ఆసియా కప్‌లో తమ జట్టు అద్భుత ప్రదర్శన చూపించడం ఖాయమని కోహ్లీ చెప్పారు.

Comments

comments